Kawasaki | ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ కవాసాకీ ఇండియా భారత్ మార్కెట్లోకి 2025 జడ్ హెచ్2 (2025 Z H2), జడ్ హెచ్2 ఎస్ఈ (Z H2 SE) మోటారు సైకిళ్లను ఆవిష్కరించింది. 2025 జడ్ హెచ్2 (2025 Z H2) మోటారు సైకిల్ రూ.24.18 లక్షలు (ఎక్స్ షోరూమ్), జడ్ హెచ్2 ఎస్ఈ (Z H2 SE) మోటారు సైకిల్ రూ.28.59 లక్షలు పలుకుతుంది. రెండు మోటారు సైకిళ్లు ఒకేలా ఉన్నా, జడ్ హెచ్2 ఎస్ఈ (Z H2 SE) మోటారు సైకిల్లో మరింత ప్రీమియం హార్డ్ వేర్ ఉంటుంది. మెటాలిక్ మ్యాట్టె గ్రాఫెన్ స్టీల్ గ్రే లేదా మిర్రర్ కోటెడ్ బ్లాక్, స్టాండర్డ్ మోడల్ ఎమరాల్డ్ బ్లేజ్డ్ గ్రీన్ లేదా మెటాలిక్ మ్యాట్టె గ్రాఫీన్ స్టీల్ గ్రే లేదా మెటాలిక్ డియాబ్లో బ్లాక్ మెషిన్ 2025 పవర్ ఫుల్ సూపర్ చార్జిడ్ జడ్ హెచ్2 ఎస్ఈ (Z H2 SE) లభిస్తుంది.
రెండు మోటారు సైకిళ్లు 998సీసీ, ఇన్ లైన్ ఫోర్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ కలిగి ఉంటాయి. గరిష్టంగా 11,000 ఆర్పీఎం వద్ద 197.2 బీహెచ్పీ విద్యుత్, 8,500 ఆర్పీఎం వద్ద 137 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. స్లిప్, అసిస్ట్ క్లచ్ తోపాటు 6-స్పీడ్ గేర్ బాక్స్ ఉంటాయి. బ్రేకింగ్ సెటప్‌లో ట్విన్ 320ఎంఎం ఫ్రంట్ డిస్క్స్, సింగిల్ 260ఎంఎం రోటర్ ఉంటాయి. జడ్ హెచ్2 మోటారు సైకిల్లో నిసిన్ మాస్టర్ సిలిండర్ తోపాటు బ్రెంబో ఎం 4.32 మోనోబ్లాక్ కాలిపర్, జడ్ హెచ్2 ఎస్ఈ మోటార్ సైకిల్ లో హై-స్పెక్ బ్రెంబో స్టైలెమా మోనోబ్లాక్ కాలిపర్, బ్రెంబో ఫ్రంట్ మాస్టర్ సిలిండర్ కలిగి ఉంటాయి.