Honda Activa 110 | ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) భారత్ మార్కెట్లో అప్డేటెడ్ ఉద్గారాల నియంత్రణ నిబంధనలకు అనుగుణంగా హోండా యాక్టీవా 110 (Honda Activa 110) స్కూటర్‌ను ఆవిష్కరించింది. దీని ధర రూ.80,950 (ఎక్స్ షోరూమ్) పలుకుతుంది. ఓబీడీ-2బీ కంప్లియంట్గా వస్తున్న హోండా యాక్టీవా 110.. డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ కలిగి ఉంటుంది. డీఎల్ఎక్స్ వేరియంట్ మాదిరిగానే అప్డేటెడ్ యాక్టీవా 110 స్కూటర్ ఉంటుంది. మూడు వేరియంట్లు – ఎస్టీడీ, డీఎల్ఎక్స్, హెచ్-స్మార్ట్ల్లో లభిస్తుంది. పెరల్ ప్రిసియస్ వైట్, డీసెంట్ బ్లూ మెటాలిక్, పెరల్ ఇగ్నిషియస్ బ్లాక్, మ్యాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్, రెబెల్ రెడ్ మెటాలిక్ పెరల్ సిరెన్ బ్లూ రంగుల్లో లభిస్తుంది.
హోండా యాక్టీవా 110 (Honda Activa 110) స్కూటర్ ఓబీడీ కర్బన ఉద్గారాల నియంత్రణ నిబంధనలకు అనుగుణంగా అప్డేట్ కావడంతోపాటు 109.51సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో వస్తోంది. 8000 ఆర్పీఎం వద్ద 7.8 బీహెచ్పీ విద్యుత్, 5500 ఆర్పీఎం వద్ద 9.05 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. ఫ్యుయల్ ఎఫిషియెన్సీ కోసం ఐడిల్ స్టార్ట్ అండ్ స్టాఫ్ ఆప్షన్ ఉంటుంది. ఈ స్కూటర్ యూఎస్బీ టైప్-సీ చార్జింగ్ పోర్ట్‌తో వస్తోంది. నేవిగేషన్, కాల్, ఎస్ఎంఎస్ అలర్ట్స్ తదితర విషయాలు తెలుసుకునేందుకు హోండా రోడ్ సింక్ యాప్‌తోపాటు కంపాటిబు డాష్ బోర్డ్ ఉంటుంది. ఈ స్కూటర్ దేశవ్యాప్తంగా ‘హెచ్ఎంఎస్ఐ’ డీలర్ల వద్ద లభిస్తుంది. టీవీఎస్ జూపిటర్, హీరో ప్లీజర్ ప్లస్ వంటి స్కూటర్లకు పోటీ ఇస్తుంది.