Kawasaki Eliminator 500 | ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ కవాసాకి మోటార్ ఇండియా.. దేశీయ మార్కె్ట్లోకి న్యూ ‘కవాసాకి ఎలిమినేటర్’ ఆవిష్కరించింది. దీని ధర రూ.5.62 లక్షలు (ఎక్స్ షోరూమ్) గా నిర్ణయించారు. గతేడాది గ్లోబల్ మార్కెట్లలో ఎలిమినేటర్-500 బైక్ ను ఆవిష్కరించారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఈ మోటారు సైకిల్‌పై ఆసక్తి గల కస్టమర్ల కోసం బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. మిడిల్ వెయిట్ క్రూయిజర్ సెగ్మెంట్లో రాయల్ ఎన్ఫీల్డ్ సూపర్ మీటర్-650 మోటారు సైకిల్‌తో కవాసాకి ఎలిమినేటర్ బైక్ పోటీ పడుతుంది.
మోడర్న్ స్టైలింగ్తోపాటు క్లాసిక్ క్రూయిజర్‌గా 2024 కవాసాకి ఎలిమినేటర్ వస్తున్నది. లో స్లంగ్ డిజైన్, లెయిడ్ బ్యాక్ స్టాన్స్‌తో వస్తున్న కవాసాకి ఎలిమినేటర్ రౌండ్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్, ఎక్స్పోజ్డ్ ఫ్రేమ్, ఆల్ బ్లాక్ కాంపొనెంట్స్, స్పీడో మీటర్ తోపాటు సర్క్యులర్ ఎల్సీడీ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, టచో మీటర్, ఫ్యుయల్ గాజ్, కూలెంట్ టెంపరేచర్, గేర్ పొజిషన్ ఇండికేటర్, టూ ట్రిప్ మీటర్స్ తదితర ఫీచర్లు ఉన్నాయి. కాల్స్, నోటిఫికేషన్స్ కోసం కవాసాకీ రెడియోలజీ యాప్ ద్వారా బ్లూటూత్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది.
నింజా 400 మోటారు సైకిల్ నుంచి న్యూ కవాసాకీ ఎలిమినేటర్ 451సీసీ పారలెల్ ట్విన్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌తో వస్తున్నది. ఈ ఇంజిన్ 9000 ఆర్పీఎం వద్ద 44 బీహెచ్పీ, 6000 ఆర్పీఎం వద్ద 46 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. స్లిప్డ్ క్లచ్‌తోపాటు 6-స్పీడ్ గేర్ బాక్స్ విత్ అసిస్ట్ వస్తోంది. ఫ్రంట్‌లో 41 ఎంఎం టెలిస్కోపిక్ ఫోర్క్స్, రేర్‌లో ట్విన్ షాక్ అబ్జార్బర్స్ ఉన్నాయి. డ్యుయల్ చానెల్ ఏబీఎస్‌తోపాటు ఫ్రంట్‌లో 310 ఎంఎం సెమీ ఫ్లోటింగ్ ఫ్రంట్ డిస్క్, రేర్‌లో 220 ఎంఎం డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి. ఈ నెల రెండో వారం నుంచి కవాసాకీ ఎలిమినేటర్ మోటారు సైకిళ్ల డెలివరీ ప్రారంభం అవుతుంది.