2024 BMW M340i | ప్రముఖ జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ (BMW) భారత్ మార్కెట్లోకి స్పోర్టీ ఎడిషన్ కంపాక్ట్ సెడాన్ కారు 2024-బీఎండబ్ల్యూ ఎం340ఐ (2024 BMW M340i) ఆవిష్కరించింది. ఈ కారు ధర రూ.74.90 లక్షలు (ఎక్స్ షోరూమ్) పలుకుతుంది. ఆసక్తిగల వారి నుంచి కార్ల బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. తొలిసారి భారత్ మార్కెట్లో బీఎండబ్ల్యూ ఎం340ఐ (BMW M340i) కారును ఆవిష్కరించారు. 2022లో బీఎండబ్ల్యూ ఎం340ఐ ఫేస్‌లిఫ్ట్ (BMW M340i Facelift) ఆవిష్కరించింది. న్యూ వీల్స్, అప్ డేటెడ్ సస్పెన్షన్, ఫ్రెష్ ఇంటీరియర్ థీమ్‌తో వస్తోందీ బీఎండబ్ల్యూ ఎం340ఐ స్పోర్టీ కారు. ఆర్కిటిక్ రేస్ బ్లూ, ఫైర్ రెడ్ పెయింట్ ఆప్షన్లు, ఎం-స్పెషిఫిక్ ఓఆర్వీఎం హౌసింగ్స్, కిడ్నీ గ్రిల్లె ఫినిష్డ్ బ్లాక్ ఎక్స్టీరియర్ డిజైన్ తోపాటు 2024- బీఎండబ్ల్యూ ఎం340ఐ (2024-BMW M340i) అందుబాటులో ఉంటుంది. రాప్ రౌండ్ ఎల్ఈడీ టెయిల్ లైట్స్, అడాప్టివ్ హెడ్ ల్యాంప్స్ విత్ బ్లూ హై లైట్స్, వారియబుల్ లైట్ కంట్రోల్, కార్నరింగ్ లైట్స్, న్యూ 19- అంగుళాల ఎం-స్పెక్ అల్లాయ్ వీల్స్ విత్ ఎం-స్పోర్ట్ బ్రేక్స్‌తో అప్డేట్ చేశారు.
2024- బీఎండబ్ల్యూ ఎం340ఐ (2024-BMW M340i) కారు క్యాబిన్లో బ్లూ కాంట్రాస్ట్ స్టిచింగ్ తోపాటు అల్ కంతారా/సెన్సాటెక్ లో అప్హోల్స్టరీ, బీఎండబ్ల్యూ లైవ్ కాక్ పిట్ ప్రొఫెషనల్, కర్వ్డ్ 14.9 అంగుళాల ఇన్ ఫోటైన్‌మెంట్ డిస్ ప్లే, వైర్ లెస్ ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, 12.3 అంగుళాల డిజిటల్ క్లస్టర్ వంటి ఫీచర్లు ఉంటాయి. ఇంకా బీఎండబ్ల్యూ డిజిటల్ కీ కూడా ఉంటుంది. కంపాటిబుల్ స్మార్ట్ ఫోన్ సాయంతో డోర్ హ్యాండిల్‌ను అన్ లాక్ చేయొచ్చు. స్మార్ట్ ఫోన్ చార్జింగ్ క్రెడిల్ లో పెట్టగానే డ్రైవర్ పుష్ బటన్ నొక్కి స్టార్ట్ చేయొచ్చు. త్రీ జోన్ క్లైమేట్ కంట్రోల్, 16-స్పీకర్ హార్మాన్ కార్డోన్ సరౌండ్ సౌండ్ సెటప్, డ్రైవర్ కోసం హెడ్ అప్ డిస్ ప్లే ఉంటాయి.
సేఫ్టీ కోసం బీఎండబ్ల్యూ ఎయిర్ బ్యాగ్స్, 360-డిగ్రీ సరౌండ్ వ్యూ కెమెరా, కార్నరింగ్ బ్రేక్ కంట్రోల్, టీపీఎంఎస్ వంటి ఫీచర్లు ఉంటాయి. 3.0 లీటర్ల టర్బో చార్జ్డ్ ఇన్ లైన్ సిక్స్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 374 బీహెచ్పీ విద్యుత్, 500 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిసన్ ఆప్షన్ తో వస్తోంది. వారియబుల్ షాక్ అబ్జార్బర్ అడ్జస్ట్మెంట్ తోపాటు అడాప్టివ్ ఎం-స్పెసిఫిక్ సస్పెన్షన్ ఉంటుంది. కంఫర్ట్, స్పోర్ట్, స్పోర్ట్+ డ్రైవింగ్ మోడ్స్‌లో లభిస్తుందీ కారు. డైనమిక్ స్టెబిలిటీ కంట్రల్ కోసం అదనపు సెట్టింగ్స్ ఉంటాయి. రోడ్డు పరిస్థితులకు అనుగుణంగా డ్రైవింగ్ స్టైల్ మార్చుకోవచ్చు.