Cayenne and Cayenne Coupe Facelift | మార్కెట్లోకి పొర్చె కాయెన్నె అండ్ కాయెన్నె కూప్ ఫేస్ లిఫ్ట్.. ధరెంతో తెలుసా..?!
Porsche Cayenne and Cayenne Coupe Facelift | ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ పొర్చె.. భారత్ మార్కెట్లోకి న్యూ కాయెన్నె అండ్ కాయెన్నె కూప్ ఫేస్ లిఫ్ట్ తెచ్చింది. ఇది ఆరు సెకన్లలో 100 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది.
Porsche Cayenne and Cayenne Coupe Facelift | ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ పొర్చె.. భారత్ మార్కెట్లో పొర్చె కాయెన్నే అండ్ కాయెన్నె కూప్ ఫేస్ లిఫ్ట్ (Porsche Cayenne and Cayenne Coupe Facelift) ఆవిష్కరించింది. ఇది కేవలం ఆరు సెకన్లలో 100 కి.మీ. స్పీడ్ అందుకుంటుంది. గరిష్టంగా గంటకు 248 కి.మీ వేగంతో వెళుతుంది. భారత్ మార్కెట్లో రేంజ్ రోవర్ స్పోర్ట్, ఆడి క్యూ8, మెర్సిడెజ్ బెంజ్ జీఎల్ఈ కార్లతో పోటీ పడుతుంది.
2023 పొర్చె కాయెన్నె అండ్ కాయెన్నె కూప్ కారు ధర రూ.1.36 కోట్లు (ఎక్స్ షోరూమ్)గా నిర్ణయించారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న కాయెన్నె అండ్ కాయెన్న కూప్ మోడల్ కారుతో పోలిస్తే రూ.7 లక్సలు ఎక్కువ. భారత్ మార్కెట్లో కేవలం బేస్ మోడల్ కార్లు మాత్రమే ఆవిష్కరించారు. హై వేరియంట్ కార్లు తర్వాత మార్కెట్లోకి తెస్తారు.
ప్రస్తుత మోడల్ కారు కంటే అప్ డేటెడ్ 2023 పొర్చె కాయెన్నె అండ్ కాయెన్నె కూప్ ఫేస్ లిఫ్ట్ అత్యంత శక్తిమంతమైన 3.0 లీటర్ల వీ6 టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో వస్తున్నది. ఈ ఇంజిన్ గరిష్టంగా 348 బీహెచ్పీ విద్యుత్, 500 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ కలిగి ఉంటుంది.
పొర్చె టాయ్కాన్ వంటి న్యూ మ్యాట్రిక్స్ ఎల్ఈడీ హెడ్ లైట్స్, వైడ్ ఫ్రంట్ గ్రిల్లె, ఫ్రంట్ బంపర్ విత్ క్రోమ్ స్లాట్స్, రీ డిజైన్ కనెక్టెడ్ 3డీ ఎల్ఈడీ టెయిల్ లైట్స్, బిగ్గర్ స్పాయిలర్, రీ డిజైన్డ్ బాయ్ నెట్, 20/21/22 అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉంటాయి.
ట్రిపుల్ స్క్రీన్ డాష్ బోర్డ్ లేఔట్, 12.6 అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 12.3 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 10.9 అంగుళాల టచ్ స్క్రీన్ సిస్టమప్ (ఆప్షనల్), 911-ఇన్స్పిరేటెడ్ వీల్, ట్యాంగిల్ స్టైల్ గేర్ షిఫ్టర్, డ్రైవ్ మోడ్ షిఫ్టర్, 4 యూఎస్బీ టైప్-సీ పోర్ట్స్, ఎయిర్ ప్యూరిఫయర్, పనోరమిక్ ఫిక్స్డ్ గ్లాస్ రూఫ్, ఆండ్రాయిడ్ ఆపిల్ కార్ ప్లే తదితర ఫీచర్లు ఉన్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

