Kia Seltos Facelift | దక్షిణ కొరియా ఆటో మేజర్ కియా మోటార్ ఇండియా ’కియా సెల్టోస్ ఫేస్ లిఫ్ట్ (Kia Seltos Facelift) కోసం కార్ల ప్రేమికుల్లో ఎంతో ఆసక్తి పెరిగింది. సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ఫేస్‌లిఫ్ట్ 2.0 ఆవిష్కరణ తేదీని కియా వెల్లడించింది. 2019 ఆగస్టులో తొలుత మార్కెట్లోకి వచ్చిన కియా సెల్టోస్.. అప్డేటెడ వర్షన్ 2023 కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ వచ్చే నెల నాలుగో తేదీన మార్కెట్లో ఆవిష్కరిస్తామని ప్రకటించింది. కార్ల మార్కెట్లో అత్యంత పోటీ సెగ్మెంట్ మిడ్ సైజ్ ఎస్యువీల్లో సెల్టోస్ పాపులర్ చాయిస్. కియా సెల్టోస్ ఫేస్ లిఫ్ట్ కారులో వచ్చే ఫీచర్ల గురించి తెలుసుకుందాం..
కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ కారు 16-అంగుళాల అల్లాయ్ వీల్స్ స్థానంలో 17-అంగుళాల అల్లాయ్ వీల్స్ వస్తాయని భావిస్తున్నారు. ఫ్రంట్ అండ్ రేర్ బంపర్స్లో అగ్రెసివ్ డిజైన్ ఉంటుంది. హెడ్‌ల్యాంప్ యూనిట్లో మార్పులు ఉండకపోవచ్చు.ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఇన్ఫోటైన్మెంట్ యూనిట్, సింగిల్ గ్లాస్ పాన్ హౌసింగ్, డిఫరెంట్ వ్యూయింగ్ మోడల్స్, ప్రస్తుత మోడల్ సెల్టోస్‌లో మాదిరిగా సింగిల్ పేన్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ కూడా ఉంటుంది.ఇంకా వెంటిలేటెడ్ సీట్స్, బోస్ ఆడియో, హెడ్ అప్ డిస్ప్లే తదితర ఫీచర్లు కూడా ఉంటాయి.
సెల్టోస్ ప్రస్తుతం 1.5 లీటర్ల డీజిల్ ఇంజిన్‌తో వస్తున్నది. ఈ ఇంజిన్ గరిష్టంగా 113 హెచ్‌పీ విద్యుత్, 250 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. పెట్రోల్ వేరియంట్ ఇంజిన్ ఆప్షన్ తీసుకురావాలని కియా మోటార్ భావిస్తే, 1.5-లీటర్ల టర్బో చార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్ ఉండవచ్చు. అయితే, ఇంకా పూర్తిగా ఫీచర్లు, డిజైన్ వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.