Kia Seltos Facelift | కార్ల ప్రేమికులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న కియా సెల్టోస్ ఫేస్ లిఫ్ట్.. శుక్రవారం మార్కెట్లోకి వచ్చేసింది. దక్షిణ కొరియా ఆటో మేజర్ కియా ఇండియా.. తన పాపులర్ మిడ్ సైజ్ ఎస్యూవీ కియా సెల్టోస్ ఫేస్ లిఫ్ట్ కారును రెండు పవర్ ట్రైన్స్‌తో 18 వేరియంట్లలో ఆవిష్కరిస్తున్నది. ఈ కారు ప్రారంభ ధర రూ.10,89,900 (ఎక్స్ షోరూమ్) తో మొదలై.. టాప్ హై ఎండ్ వేరియంట్ ధర రూ.19,99,900లకు లభిస్తుంది.
2023 సెల్టోస్ ఫేస్ లిఫ్ట్ మూడు ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తున్నది. స్మార్ట్ స్ట్రీమ్ 1.5 లీటర్ల టర్బో జీడీఐ పెట్రోల్ (160 పీఎస్ /253 ఎన్ఎం) స్మార్ట్ స్ట్రీమ్ 1.5-లీటర్ల ఎన్ఏ పెట్రోల్ (115 పీఎస్ / 144 ఎన్ఎం), స్మార్ట్ స్ట్రీమ్ 1.5-లీటర్ల సీఆర్డీఐ వీజీటీ డీజిల్ 116 పీఎస్/ 250 ఎన్ఎం) ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి.
టర్బో పెట్రోల్ యూనిట్ ఇంజిన్ 6-స్పీడ్ ఐఎంటీ లేదా 7-స్పీడ్ డీసీటీ, ఎన్ఏ పెట్రోల్ యూనిట్ 6-స్పీడ్ ఎంటీ లేదా ఐవీటీ, డీజిల్ యూనిట్ 6-స్పీడ్ ఐఎంటీ లేదా 6-స్పీడ్ ఏటీ వర్షన్లలో లభిస్తుంది. ఈ నెల నాలుగో తేదీన సెల్టోస్ ఫేస్ లిఫ్ట్‌ను ఆవిష్కరించింది. కియా ఇండియా. ఈ నెల 14న ప్రీబుకింగ్స్ తొలి రోజే 13,424 కార్లు బుక్ అయ్యాయి.
హెచ్‌టీఈ – రూ. 10,89,900
హెచ్టీకే- రూ. 12,09,900
హెచ్టీకే ప్లస్ – రూ. 13,49,900
హెచ్‌టీఎక్స్ – రూ.15,19,900
హెచ్‌టీఎక్స్ – రూ. 16,59,900
హెచ్టీకే ప్లస్ – రూ. 14,99,900
హెచ్‌టీఎక్స్ ప్లస్ – రూ. 18,29,900
హెచ్‌టీఎక్స్ ప్లస్ – రూ.19,19,900
జీటీఎక్స్ ప్లస్ – రూ. 19,79,900
ఎక్స్ లైన్ – రూ. 19,99,900
హెచ్‌టీఈ – రూ. 11,99,900
హెచ్టీకే – రూ. 13,59,900
హెచ్టీకే ప్లస్ – రూ.14,99,900
హెచ్‌టీఎక్స్ – రూ. 16,69,900
హెచ్‌టీఎక్స్ ప్లస్ – రూ. 18,29,900
హెచ్‌టీఎక్స్ – రూ. 18,19,900
జీటీఎక్స్ ప్లస్ – రూ. 19,79,900
ఎక్స్ లైన్ – రూ. 19,99,900