BMW super bike | మన దేశంలో సూపర్ స్పోర్ట్స్ బైక్‌ల సంస్కృతి నానాటికి రెట్టింపువతున్నది. సూపర్ బైక్ ప్రేమికులను దృష్టిలో పెట్టుకొని పలు కంపెనీలు కొత్త మోడల్స్‌ను మార్కెట్లో దించుతున్నాయి. యువతను ఆకట్టుకునే ప్రయత్నంలో భాగంగా బీఎండబ్ల్యూ సంస్థ తన సూపర్ స్పోర్ట్స్ బైక్‌ను మార్కెట్‌కు పరిచయం చేసేందుకు సిద్ధమైంది. బీఎండబ్ల్యూ ఎస్ 1000 ఆర్ఆర్ బైకును డిసెంబర్ 10 న ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నది.
బీఎండబ్ల్యూ ఫ్లాగ్షిప్ బైక్‌లలో అత్యంత సమగ్రంగా సవరించిన ఛాసెస్ను కలిగి ఉండటం ఈ సూపర్ బైక్ ప్రాధాన్యత. ఇంజిన్, సస్పెన్షన్, ఛాసిస్, ఏరోడైనమిక్స్, డిజైన్, అసిస్టెన్స్ సిస్టంలలో అప్డేట్లను జోడించింది. ఇది 999 సీసీ ఇన్లైన్ఫోర్ మోటార్ శక్తితో నడుస్తుంది. ఆరు గేర్లుండే ఈ బైక్ 13,750 ఆర్పీఎంతో మాగ్జిమమ్ పవర్ 206.5 బీహెచ్పీకి చేరుతుంది. బండి మొత్తం 192 కిలోలు ఉండే ఈ బైక్ ధర (ఎక్స్‌షోరూం ప్రైస్) రూ.20,50,000 గా ఉన్నది.
బ్లాక్‌స్టార్మ్ మెటాలిక్, స్టైల్ ప్యాషన్ రెడ్ నాన్-మెటాలిక్, లైట్ వైట్ నాన్-మెటాలిక్ రంగుల్లో ఈ స్పోర్ట్స్ బైక్ అందుబాటులోకి తీసుకొచ్చారు. కార్బన్ ప్యాకేజీలో ఫ్రంట్ వీల్ ఫెండర్, రియర్ వీల్ మడ్‌గార్డ్, చైన్ గార్డ్, సైడ్ ట్రిమ్ కలిగిఉండి ఎంతగానో ఆకట్టుకుంటున్నది. రేస్ ప్యాకేజీ ఎం ఎండ్యూరెన్స్ చైన్, ఎం టైటానియం స్పోర్ట్స్ సైలెన్సర్ లేదా ఎం ఫుల్ టైటానియం ఎగ్జాస్ట్ సిస్టమ్ ఈ బైక్ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.