హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కొత్త అక్రెడిటేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న అర్హులైన వరింగ్ జర్నలిస్టులకు హైకోర్టు ఊరట కల్పించింది. వారి వద్ద ఉన్న పాత కార్డుల గడువును సెప్టెంబర్ 15 వరకు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
కొత్తగా అక్రెడిటేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నవారితోపాటు గతంలో కార్డులు లేనివారి కోసం ప్రస్తుతానికి ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 15కు వాయిదా వేస్తున్నట్టు ధర్మాసనం ప్రకటించింది.
హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ) : ప్రైవేటు భూవివాదం నేపథ్యంలో నమోదైన ఓ ఎఫ్ఐఆర్ను రద్దు చేసేందుకు సింగిల్ జడ్జి నిరాకరించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన లెటర్స్ పేటెంట్ అప్పీల్‌ను హైకోర్టు కొట్టివేసింది.
ఎఫ్ఐఆర్ రద్దుకు సంబంధించిన వ్యవహారం క్రిమినల్ జ్యురిస్డిక్షన్ పరిధిలోకి వస్తుందని, అలాంటి అంశంపై లెటర్స్ పేటెంట్ కింద ఇంట్రా కోర్టు అప్పీల్‌కు అవకాశం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. పిటిషన్‌ను ఏ పేరుతో దాఖలు చేశారన్నది కాకు ండా అందులో కోరిన ఉపశమనాన్ని, దాని ఫలితాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని పేరొన్నది. పిటిషనర్‌కు చట్టప్రకారం లభించే ఇతర పరిహార మార్గాలపై తాము ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయడం లేదని స్పష్టంచేసింది.