న్యూఢిల్లీ, జూలై 18: మారుతి సుజుకీ..మార్కెట్లోకి ఎంట్రిలెవల్ హ్యాచ్బ్యాక్ సరికొత్త ఎస్-ప్రెస్సోను పరిచయం చేసింది. ఈ కారు రూ.4.25 లక్షలు మొదలుకొని రూ.5.99 లక్షల గరిష్ఠ ధరల్లో లభించనున్నది. ఈ ధరలు ఢిల్లీ షోరూంనకు సంబంధించినవి. దీంట్లో మాన్యువల్ రకం రూ.4.25 లక్షల నుంచి రూ.5.49 లక్షల లోపు లభించనుండగా, ఆటోమేటిక్ గేర్ షిప్ట్(ఏజీఎస్) మోడల్ రూ.5.65 లక్షల నుంచి రూ.5.99 లక్షల లోపు లభించనున్నది. ఒక్క లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలిగిన ఈ మోడల్ లీటర్కు 25.3 కిలోమీటర్ల మైలేజీ ఇవ్వనున్నది. భద్రత ప్రమాణాలు మెరుగుపర్చడంలో భాగంగా ఈ మోడల్లో రెండు ఎయిర్ బ్యాగ్లు, హై-స్పీడ్ అలర్ట్ సిస్టమ్, రివర్స్ పార్కింగ్ సెన్సార్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.