న్యూఢిల్లీ, మార్చి 17: ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ హోండా మోటర్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా…తాజాగా దేశీయ మార్కెట్లోకి మరో స్పోర్ట్స్ బైక్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆఫ్రికా ట్విన్ అడ్వెంచర్ స్పోర్ట్స్ బైకును మరింత ఆధునీకరించి అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ బైకు ప్రారంభ ధర రూ.16 లక్షలుగా నిర్ణయించింది. మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెర్షన్ రూ.16.01 లక్షలకు లభించనుండగా, డ్యూయల్-క్లచ్ ట్రాన్స్మిషన్ మోడల్ ధర రూ.17.55 లక్షలుగా నిర్ణయించింది. 1,082.96 సీసీ ఇంజిన్ కలిగిన ఈ స్పోర్ట్స్ బైక్‌లో ఏబీఎస్, బ్లూటూత్ కనెక్టివిటీ సదుపాయం వంటి ఫీచర్స్ ఉన్నాయి.