న్యూఢిల్లీ, ఆగస్టు 30: ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ… దేశీయ మార్కెట్లోకి సరికొత్త బైకును అందుబాటులోకి తీసుకొచ్చింది. తన ఫ్లాగ్షిప్ మోడలైన అపాచీ 310ను సరికొత్తగా ఆవిష్కరించింది. రేస్ కిట్, డైనమిక్ కిట్ మోడళ్లలో లభించనున్న ఈబైకు ధర రూ.2.6 లక్షలుగా నిర్ణయించింది. ఈ సరికొత్త అపాచీ ఆర్ ఆర్ మోడల్‌ను 312.20 సీసీ సామర్థ్యంతో ఇంజిన్ రూపొందించింది.