HomeBusiness200 Crore Investment By Asahi In Standard Glass
స్టాండర్డ్ గ్లాస్లో ఆసాహీ 200 కోట్ల పెట్టుబడి
గ్లాస్ లైన్డ్ ఎక్విప్మెంట్ రంగంలో ఉన్న హైదరాబాద్కి చెందిన స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీలో ఇంజనీర్ గ్లాస్ సిస్టమ్స్ తయారీ కంపెనీ ఆసాహీ గ్లాస్ప్లాంట్(ఏఐజీ జపాన్) రూ.200 కోట్ల మేర పెట్టుబడి పెట్టింది.
హైదరాబాద్, నవంబర్ 16: గ్లాస్ లైన్డ్ ఎక్విప్మెంట్ రంగంలో ఉన్న హైదరాబాద్కి చెందిన స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీలో ఇంజనీర్ గ్లాస్ సిస్టమ్స్ తయారీ కంపెనీ ఆసాహీ గ్లాస్ప్లాంట్(ఏఐజీ జపాన్) రూ.200 కోట్ల మేర పెట్టుబడి పెట్టింది. దీంతో స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీలో ఏఐజీ జపాన్, జీఎల్ హాకో అనుబంధ కంపెనీలకు వాటా వాటా దక్కనున్నది.
జీఎల్ హాకో ఉత్పత్తులను పెద్ద ఎత్తున మార్కెట్ చేయడంతోపాటు గ్లాస్-లైన్డ్ రియాక్టర్ల భద్రతను పెంపొందించడానికి ఎస్ఈఎఫ్ గ్లాస్ టెక్నాలజీని రూపొందించాలని స్టాండర్డ్ గ్రూపు లక్ష్యంగా పెట్టుకున్నట్టు కంపెనీ ఎండీ నాగేశ్వర రావు తెలిపారు. ఇందుకోసం హైదరాబాద్కు సమీపంలో 36 ఎకరాల్లో భారీ స్థాయిలో గ్లాస్ ఎక్విప్మెంట్ తయారీ ప్లాంటును స్టాండర్డ్ గ్లాస్ నిర్మిస్తున్నదన్నారు.
వెల్డింగ్ రోబోలు, సెమీ ఆటోమేటెడ్ కట్టింగ్, బెండింగ్, వెల్డింగ్ యంత్రాలు, అధునాతన వెల్డింగ్ పవర్ సోర్సేస్తో సహా అత్యాధునిక యంత్రాలను నెలకొల్పుతున్నారు. 2012లో ప్రారంభమైన స్టాండర్డ్ గ్రూపు ప్రస్తుత టర్నోవర్ రూ.750 కోట్లుగా ఉన్నది.