హైదరాబాద్, అక్టోబర్ 4: హైదరాబాద్‌కు చెందిన కార్యకలాపాలు అందిస్తున్న ప్రొడక్ట్ స్టూడియో జెమోసో..భారీ స్థాయిలో ఉద్యోగులను నియమించుకోవడానికి సిద్ధమైంది. వచ్చే ఏడాది చివరినాటికి సిబ్బంది సంఖ్యను 300 నుంచి 600 మందికి పెంచుకోనున్న సంస్థ..2023లో మరో 2 వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు ప్రకటించింది. దీంతో వచ్చే రెండేండ్లలో 2,600 మందిని రిక్రూట్ చేసుకోనున్నది కంపెనీ. ప్రస్తుతం సంస్థకు హైదరాబాద్, అమెరికాలో ఉన్న కార్యాలయాల్లో 300 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. స్టార్టప్‌లు, ఎంటర్ప్రెన్యూర్, ఇన్నోవేటర్ల కొత్త ఆలోచనలపై సహాయ సహకారాలు అందిస్తున్నది జెమోసో.
గడిచిన మూడేండ్లకాలంలో స్టార్టప్‌లో 900 మిలియన్ డాలర్ల నిధుల సేకరణకు సంబంధించి సహాయ సహకారాలు అందించినట్లు కంపెనీ సీఈవో సతీష్ మధిరా తెలిపారు. వచ్చే తొమ్మిది నెలల్లో యూరప్‌కు కూడా వ్యాపారాన్ని విస్తరించేయోచనలోసంస్థ ఉన్నదని, అలాగే లాటిన్ అమెరికాలో ఉన్న కార్యాలయాన్ని కూడా విస్తరించాలనుకుంటున్నట్లు ప్రకటించారు. సంస్థలో మహిళా ఉద్యోగులకు పెద్దపీట వేస్తున్నట్లు, ప్రతి ముగ్గురు సిబ్బందిలో ఒకరు మహిళా ఉన్నారని ఆయన చెప్పారు.