ముంబై, ఆగస్టు 7: ఉపాధి కల్పనలో రిలయన్స్ దూసుకుపోతున్నది. 2022-23 ఆర్థిక సంవత్సరంలోనూ 2.6 లక్షల మందికి ఉపాధి కల్పించింది. 2021-22లో 2.32 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఆ మరుసటి ఏడాదిలో ఇంతకంటే ఎక్కువ స్థాయిలోనే సిబ్బందిని రిక్రూట్ చేసుకున్నట్లు తన వార్షిక నివేదికలో వెల్లడించింది. కరోనా సమయంలోనూ సంస్థ 75 వేల మందిని రిక్రూట్ చేసుకోవడం విశేషం. గతేడాది తీసుకున్న 2.62 లక్షల మందిలో 1.8 లక్షలు రిటైల్ గ్రూపులో తీసుకోగా, 70,500 మందిని జియో నెట్వర్క్లో తీసుకున్నది. దీంతో మొత్తం సిబ్బంది సంఖ్య 3.89 లక్షలకు చేరుకున్నారు.