19న కేఫిన్ ఐపీవో షేర్ రూ.347-366
హైదరాబాద్‌కు చెందిన ఆర్థిక సేవల సంస్థ కేఫిన్ టెక్నాలజీస్ పబ్లిక్ ఇష్యూ ఈ నెల 19న (సోమవారం) మొదలు కానున్నది.
న్యూఢిల్లీ, డిసెంబర్ 14: హైదరాబాద్‌కు చెందిన ఆర్థిక సేవల సంస్థ కేఫిన్ టెక్నాలజీస్ పబ్లిక్ ఇష్యూ ఈ నెల 19న (సోమవారం) మొదలు కానున్నది. వచ్చే బుధవారం ముగుస్తుంది. అయితే యాంకర్ ఇన్వెస్టర్ల కోసం బిడ్డింగ్ శుక్రవారం నుంచే ప్రారంభమవుతుంది. కాగా, ఈ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) ధరల శ్రేణిని రూ.347-366 గా నిర్ణయించారు. మూడు రోజుల ఈ పబ్లిక్ ఇష్యూలో షేర్ల విక్రయం ద్వారా రూ.1,500 కోట్లదాకా నిధులను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు కంపెనీ బుధవారం తెలియజేసింది. సంస్థ ప్రస్తుత ప్రమోటర్.. జనరల్ అట్లాంటిక్ సింగపూర్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్)గానే ఈ ఐపీవో వస్తున్నది. కేఫిన్ టెక్నాలజీస్‌లో ప్రమోటర్, వారి గ్రూప్‌నకు 74.37 శాతం వాటా ఉండగా, కొటక్ మహీంద్రా బ్యాంక్ లిమిటెడ్‌కు మరో 9.98 శాతం వాటా ఉన్నది. ఇదిలావుంటే ఈ పబ్లిక్ ఇష్యూలో క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కోసం 75 శాతం, నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కోసం 15 శాతం, రిటైల్ ఇన్వెస్టర్ల కోసం 10 శాతం షేర్లు కేటాయించారు. మదుపరులు కనీసం 40 షేర్లనైనా సబ్‌స్ర్కైబ్ చేసుకోవాల్సి ఉంటుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

