న్యూఢిల్లీ, మార్చి 23 : ఒక్క మహిళా డైరెక్టర్ కూడా లేని ప్రభుత్వరంగ సంస్థలు ఎన్నో ఉన్నాయి. మహిళలకు పెద్దపీట వేస్తున్నామని గొప్పులు చెప్పుకుంటున్న మోదీ సర్కార్ ఆచరణలో మాత్రం విఫలమైంది. 179కి పైగా ప్రభుత్వ, దాని అనుబంధ సంస్థల్లో ఒక్క మహిళా డైరెక్టర్ కూడా లేకపోవడం శోచనీయం. కంపెనీ చట్టం 2013 ప్రకారం స్టాక్ మార్కెట్లో లిైస్టెన ప్రతి సంస్థలో ఒక మహిళా డైరెక్టర్ ఉండాలని నిబంధన ఉన్నప్పటికీ ఈ నిబంధనను పట్టించుకోని ప్రభుత్వ రంగ సంస్థలే అధికంగా ఉన్నాయి.
స్టాక్ మార్కెట్లో లిైస్టెన ప్రతి సంస్థ లేదా పెయిడ్-అప్ క్యాపిటల్ రూ.100 కోట్లు లేదా రూ.300 కోట్ల వార్షిక టర్నోవర్ దాటిన సంస్థలు ఈ నిబంధనను పాటించాల్సి ఉంటుంది. ఏడాదిగా 529 కంపెనీలు తమ బోర్డులో ఒక మహిళా డైరెక్టర్‌ను నియమించుకోగా..179 సంస్థలు ఇప్పటి వరకు ఎలాంటి నియామకాలు చేపట్టలేదని లోక్‌సభలో కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి హర్ష లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ప్రభుత్వ సంస్థల్లో 668 మహిళలు, 3,423 మంది పురుషులను డైరెక్టర్లుగా నియమించుకున్నాయి.