‘సిటీ’ క్రెడిట్ కార్డుపై ‘ఎస్బీఐ’ కన్ను
‘సిటీ’ క్రెడిట్ కార్డుపై ‘ఎస్బీఐ’ } సిటీ బ్యాంక్ ఆధ్వర్యంలోనే క్రెడిట్ కార్డు బిజినెస్‌పై కేంద్ర ప్రభుత్వ రంగ వాణిజ్య సంస్థ భారతీయ స్టేట్ బ్యాంక్...

ముంబై: సిటీ బ్యాంక్ ఆధ్వర్యంలోనే క్రెడిట్ కార్డు బిజినెస్‌పై కేంద్ర ప్రభుత్వ రంగ వాణిజ్య సంస్థ భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ), ఇతర ప్రైవేట్ బ్యాంకులు కన్నేశాయి. భారత్ మార్కెట్ నుంచి వైదొలగాలని సిటీ గ్రూప్ గురువారం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
సిటీ బ్యాంక్ నిష్క్రమణతో దేశంలోని క్రెడిట్ కార్డుల మార్కెట్లో విస్తరించడానికి ఎస్బీఐతో సహా పలు బ్యాంకులకు చక్కని అవకాశం లభించింది. సిటీ క్రెడిట్ కార్డుల బిజినెస్‌ను టేకోవర్ చేస్తుందన్న అంచనాల మధ్య శుక్రవారం ఎస్బీఐ అనుబంధ సంస్థ ఎస్బీఐ కార్డ్ షేర్ 7.5 శాతం పెరుగడం గమనార్హం.
ఒకవైపు భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) ఆంక్షలను అమలు చేస్తూనే క్రెడిట్ కార్డుల బిజినెస్‌లో అతిపెద్ద సంస్థగా హెచ్డీఎఫ్సీ బ్యాంకుకు పేరుందని ఆ సంస్థ వర్గాల సమాచారం. ప్రత్యర్థుల బిజినెస్ క్రమంగా నెమ్మదించడంతో ఎస్బీఐ దూసుకెళ్లింది. ఇదే ఇప్పుడు సిటీ క్రెడిట్ కార్డు బిజినెస్‌ను టేకోవర్ చేయడానికి సానుకూలంగా మారిందన్న అభిప్రాయం ఉంది.
సిటీ బ్యాంకు వివిధ విభాగాలను విడివిడిగా విక్రయించనున్నదని మాక్క్వైర్ క్యాపిటల్ రీసెర్చ్ అనలిస్ట్ సురేశ్ గణపతి తెలిపారు. ఈ నేపథ్యంలో పలు బ్యాంకులు.. సిటీ క్రెడిట్ కార్డుల బిజినెస్ పట్ల ఆసక్తి చూపుతున్నాయి.రత్నాకర్ బ్యాంక్ లిమిటెడ్ (ఆర్బీఎల్), ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ వంటి చిన్న బ్యాంకులు కూడా సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డుల బిజినెస్‌ను టేకోవర్ చేసేందుకు అవసరమైన బిడ్లను దాఖలు చేయడానికి సిద్ధంగా ఉన్నాయి.
ఒకప్పుడు క్రెడిట్ కార్డుల బిజినెస్‌లో లీడర్‌గా ఎదిగిన సిటీ బ్యాంక్.. ఏండ్లు గడుస్తున్నా కొద్దీ తన వాటాను కోల్పోయింది. రిటైల్ బిజినెస్ నుంచి నిష్క్రమణ ప్రకటన చేయడానికి ముందు కూడా సిటీ బ్యాంక్ తన శాఖల్లో బిజినెస్‌ను తగ్గించేసింది. క్రెడిట్ కార్డుల స్వాధీనం, ఇతర సంస్థలతో భాగస్వామ్యంపై ఫోకస్ చేసింది.

దేశీయ క్రెడిట్ కార్డుల బిజినెస్‌లో సిటీ బ్యాంక్ ఆరో స్థానంలో ఉంది. మొదటి స్థానంలో ఉన్న హెచ్‌డీఎఫ్‌సీకి 15.3 మిలియన్ల ఖాతాదారులు, రెండో స్థానంలోని ఎస్బీఐకి 11.6 మిలియన్ల ఖాతాదారులు ఉన్నారు. ఐసీఐసీఐకి 10.2 మిలియన్లు, యాక్సిస్ బ్యాంక్‌కు 69 లక్షల మంది, ఆర్‌బీఎల్‌కు 29 లక్షల మంది ఖాతాదారులు ఉన్నారు. తర్వాత ఆరో స్థానంలో ఉన్న సిటీ బ్యాంకులో 27 లక్షల మంది, ఏడో స్థానంలోని కొటక్‌లో 24 లక్షల మంది, అమెక్స్లో 16 లక్షల మంది కస్టమర్లు ఉన్నారు.
అయితే, భారీ సంఖ్యలో హైనెట్వర్త్ కస్టమర్లు కలిగి ఉండటంతో సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డు పోర్ట్‌ఫోలియో హై క్వాలిటీ పోర్ట్‌ఫోలియోగా నిలిచింది. క్రెడిట్ కార్డుల ఇండస్ట్రీలోనే సగటున సిటీ క్రెడిట్ కార్డు గణనీయంగా వాడుతున్నారు. మొత్తం క్రెడిట్ కార్డు మార్కెట్లో ఎస్బీఐ వాటా 20 శాతం ఉంది. దీని విలువ రూ.90వేల కోట్ల పై చిలుకే. సిటీ క్రెడిట్ కార్డుల విలువ కనీసం రూ.22 వేల కోట్లు ఉంటుంది.
ఇటీవలే క్రెడిట్ కార్డుల కంపెనీల గుర్తింపు నిబంధనలను ఆర్బీఐ సవరించింది. క్రెడిట్ కార్డుల బిల్లు వసూళ్లకు బ్రాంచ్ నెట్వర్క్ అవసరం అని బ్యాంకర్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎస్బీఐతోపాటు దేశీయ ప్రైవేట్ బ్యాంకర్లు, విదేశీ బ్యాంకులు.. సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డు వ్యవస్థను టేకోవర్ చేయడానికి ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయి. ఇటీవలే లక్ష్మీ విలాస్ బ్యాంక్ (ఎల్వీబీ)ని డీబీఎస్ టేకోవర్ చేసింది. ఇక హెచ్ఎస్బీసీ, స్టాన్‌చార్ట్ బ్యాంకులు సిటీ క్రెడిట్ కార్డు బిజినెస్ బరిలో నిలువొచ్చు.
ఇవి కూడా చదవండి..
స్మార్ట్‌గా దోపిడీ.. రూ.5 లక్షలు చోరీ
బ్యాంక్ అలర్ట్ : ఆదివారం ఆర్టీజీఎస్ సేవలకు బ్రేక్!
ఐటీ ఉద్యోగాల జాతర
ఈనెల 30 వరకు గురుకులసెట్ దరఖాస్తులు
నీట్-2021వాయిదా
దేశంలోకి త్వరలో కొత్తగా 8 బ్యాంకులు
చౌక వడ్డీకే బంగారం లోన్.. ఈ బ్యాంకుల్లోనే..!
వాట్సాప్ లో ఈ తప్పులు అస్సలు చేయొద్దు
ఫుడ్ అగ్రిగేటర్ స్విగ్గీ విలువ ఎంతంటే!
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- citibank
- credi cards
- sbi
RELATED ARTICLES
తాజా వార్తలు
Rajasthan | రోడ్డు నిర్మాణ పనుల్లో కరెంట్ షాక్.. 8 మంది కార్మికులు దుర్మరణం
AP News | కుటుంబ కలహాలతో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న తల్లీ, కొడుకు, కోడలు..!
Flight Services | మురసు తుపాను ప్రభావం.. విజయవాడ నుంచి 12 విమాన సర్వీసులు రద్దు
Delhi Traders: 2.5 లక్షల షాపులు మూసివేత.. 10000 కోట్ల నష్టం
Tirumala | తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 4 గంటల సమయం
ట్రెండింగ్ వార్తలు
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video

