న్యూఢిల్లీ, ఆగస్టు 25: హైదరాబాద్ కేంద్రం గా కార్యకలాపాలు నిర్వహిస్తున్న విజయ డయాగ్నస్టిక్ సెంటర్ తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభంకానుంది. ఆఫర్ సెప్టెంబర్ 3న ముగుస్తుంది. అదే నెల 24న విజయ డయాగ్నస్టిక్ షేర్లు స్టాక్ ఎక్సేంజీల్లో లిస్ట్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఐపీవో ధరల శ్రేణిని కంపెనీ ఇంకా ప్రకటించలేదు. ఈ ఐపీవోలో కంపెనీ తాజాగా కొత్త ఈక్విటీ షేర్లను జారీచేయబోవడం లేదు. ప్రమోటర్ డాక్టర్ ఎస్ సురేంద్రనాథ్ రెడ్డి, ప్రస్తుత ఇన్వెస్టింగ్ సంస్థలు కరాకోరమ్, కేదారా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్లు 3.57 కోట్ల షేర్లను ఈ ఆఫర్ ద్వారా విక్రయించనున్నాయి. దక్షిణాదిన పెద్ద డయాగ్నస్టిక్ చైన్స్‌లో ఒకటైన విజయ డయాగ్నస్టిక్ సెంటర్ తెలంగాణ, ఆంధప్రదేశ్, ఎన్సీఆర్, కొల్కాతాల్లో 80 డయాగ్నస్టిక్ సెంటర్లను, 11 రిఫరెన్స్ ల్యాబొరెటరీలను నిర్వహిస్తున్నది.