న్యూఢిల్లీ, మే 2: టాటా గ్రూప్ ఉక్కు తయారీ కంపెనీ టాటా స్టీల్ ముగిసిన మార్చి త్రైమాసికంలో టర్నరౌండ్ అయ్యింది. రూ. 1,566 కోట్ల నికరలాభాన్ని సాధించింది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ. 2,501 కోట్ల భారీ నష్టాన్ని చవిచూసిన క్యూ4లో లాభాలు ఆర్జించగలిగింది. 2023 జనవరి-మార్చిలో క్యూ3తో పోలిస్తే కన్సాలిడేటెడ్ ఆదాయం 10.3 శాతం వృద్ధిచెంది రూ. 57,083 కోట్ల నుంచి రూ.62,961 కోట్లకు చేరింది. కంపెనీ డైరెక్టర్ల బోర్డు షేరుకు రూ. 3.60 చొప్పున డివిడెండు సిఫార్సు చేసింది.