గురువారం 28 జనవరి 2021
Beauty-tips - Nov 24, 2020 , 20:54:56

చలికాలంలో కూడా సన్‌స్క్రీన్ ఎందుకు రాసుకోవాలి?

చలికాలంలో కూడా సన్‌స్క్రీన్ ఎందుకు రాసుకోవాలి?

హైద‌రాబాద్ : మనందరికీ తెలుసు సన్‌స్క్రీన్ లోషన్ ఎండ నుంచి మన చర్మాన్ని కాపాడుతుందని. సూర్యుని నుంచి వచ్చే యూవీ రేస్ చాలా డేంజర్.అందుకని ఎక్కువ సేపు ఎండలో కూర్చోవడం వల్ల చర్మం పొడిగా మారి, వయసు ముదిరిన వారిలా కనిపిస్తాం. అంతేకాదు.. కొన్నిసార్లు చర్మం కాలి.. నల్లగా మారిపోతుంది కూడా. వీటన్నింటికీ తగ్గించేందుకు మనకు సన్‌స్క్రీన్ బాగా పనిచేస్తుంది. అయితే ఇదంతా ఎండాకాలం కదా.. చలికాలం వచ్చాక కూడా సన్‌స్క్రీన్ తో పనేంటి.. అని అనుకుంటున్నారా. అయొతే పొరపాటు చేసినట్టే అంటున్నారు చర్మ వైద్యులు.  

నిజానికి సన్‌స్క్రీన్ ఎండలో బయటకు వెళ్లినప్పుడే కాదు.. ఇంట్లో ఉన్నప్పుడు కూడా రాసుకోవాలట. ఎందుకు అంటే కొన్ని కారణాలు కూడా ఉన్నాయంటున్నారు. మరి అవేంటో మనం కూడా తెలుసుకుని మన చర్మాన్ని కాపాడుకునే ప్రయత్నం చేద్దాం..

1. రక్షణ పొరగా పనిచేస్తుంది

సన్‌స్క్రీన్ లోషన్ మన చర్మానికి ఒక రక్షణ పొరలా పనిచేస్తుంది. ఇది కేవలం సూర్యుని వచ్చే యూవీ రేస్ భారి నుంచే కాక.. దుమ్ము, ధూళి, మురికి, పొగ, పొల్యూషన్ లాంటివి మన చర్మంలోకి ప్రవేశించకుండా ఆపుతుంది. ఫలితంగా చర్మసమస్యలు రాకుండా ఉంటాయి.

2. వయసు పైబడినట్లు కనపడనివ్వదు

సన్‌స్క్రీన్ రాసుకోవడం వల్ల ముఖ్యంగా వయసు పైబటినట్లు కనపడకుండా ఉండచ్చు. ఇది చర్మంపై ముడతలు, చారలను బయటపడనివ్వదు. అంతేకాక చలికాలంలో చర్మాన్ని పొడిబారనివ్వకుండా మృదువుగా ఉంచుతుంది.

3. చర్మం కాంతివంతంగా మారుతుంది

సూర్యుడి వేడి తగిలినప్పుడు మొహంపై కొన్ని చోట్ల అంటే.. నుదురు, ముక్కు చుట్టూరా ట్యాన్ అయి నల్లగా మారుతుంది.  ఇది మొహాన్ని జిడ్డుగా కనిపించేలా చేస్తుంది. సన్‌స్క్రీన్ ట్యాన్ ను అరికట్టి చర్మాన్ని కాంతివంతంగా కనిపించేలా మారుస్తుంది.


logo