Lip care | చలికాలంలో పెదవులు పగులుతున్నాయా? ఈ టిప్స్ పాటించండి
lip care | చలికాలంలో కామన్‌గా కనిపించే సమస్య పెదవులు ఎండిపోవడం. ఎండిపోయి పగలడం. ఇలాంటి సమయంలో ఇంట్లో దొరికే ఈ వస్తువులతో మళ్లీ పెదవులు అందంగా కనిపించేలా చేయొచ్చు. ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
lip care | చలికాలంలో కామన్‌గా కనిపించే సమస్య పెదవులు ఎండిపోవడం. ఎండిపోయి పగలడం. చలి కారణంగా పెదవులపై తేమ లేకపోవడంతో అవి నిర్జీవంగా మారుతుంటాయి. ఇలాంటి సమయంలో ఇంట్లో దొరికే ఈ వస్తువులతో మళ్లీ పెదవులు అందంగా కనిపించేలా చేయొచ్చు. మరి ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
♦ తేనెతో కాస్త వ్యాస్లిన్ కలిపిన మిశ్రమాన్ని రోజువారీగా రాసుకుంటే పెదవులు గులాబీల్లా మెరుస్తాయి. రోజూ రాత్రి పడుకునే ముందు తేనెతో పెదవులపై మర్దన చేస్తే పెదవులు తేమను కోల్పోకుండా ఉంటాయి.
♦ చలికాలం ఎక్కువగా దాహం వేయదు. కానీ ఎప్పటిలాగే శరీరానికి కావాల్సినంత నీటిని తప్పకుండా తాగాలి. దాహం వేసినా వేయకపోయినా ప్రతి గంటకు ఓ గ్లాసు నీరు తాగడం మంచిది.
♦ చలికాలంలో పెదాలకు అలోవెరా ఆయిల్, ఆలివ్ ఆయిల్స్‌ను రాసినా మంచి ఫలితం ఉంటుంది. రోజూ రాత్రి పడుకునే ముందు అలోవెరా ఆయిల్ లేదా ఆలివ్ ఆయిల్‌ను పెదాలకు రాసి పడుకోవాలి. ఉదయం వరకు పెదాలకు కావాల్సిన తేమ అందుతుంది.
♦ మిల్క్ క్రీమ్స్ వాడితే పెదవుల పగుళ్లను నివారించవచ్చు. నెయ్యిని రోజూ రాత్రి పడుకునే ముందు పెదవులకు రాయాలి. కొబ్బరి నూనెను కూడా స్నానానికి ముందు వాడితే మంచి ఫలితం ఉంటుంది. ఈ చిట్కాను చలికాలం మొత్తం పాటించవచ్చు.
♦ లిప్‌బామ్‌ను పెదాలకు రాసి కొంతసేపయ్యాక టూత్‌బ్రష్‌తో పెదాలపై సున్నితంగా బ్రష్ చేయాలి. అనంతరం ఒక శుభ్రమైన గుడ్డను వేడి నీటిలో ముంచి పెదాలను తుడవాలి. మళ్లీ కొంత సమయానికి మళ్లీ ఇలాగే చేయాలి. ఇలా చేయడం వల్ల పెదవులు మృదువుగా మారుతాయి.
♦ కొన్ని దానిమ్మ గింజలను తీసుకొని వాటి నుంచి జ్యూస్ తీయాలి. ఆ జ్యూస్‌ను ఫ్రిజ్‌లో నిల్వ చేసుకోవాలి. రోజూ కొద్ది మొత్తంలో ఆ జ్యూస్‌ను తీసుకొని అందులో కాటన్ బాల్స్ ముంచి వాటితో పెదాలపై సున్నితంగా మర్దన చేయాలి.
Read More :
“Wrinkles | చర్మంపై ముడతలు తగ్గాలా? నిమ్మకాయతో ఇలా చేస్తే సరి!!”
Read Today's Latest Beauty-tips News in Telugu and Telugu News
- Tags
- beauty tips
- lip care
- lips
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

