శనివారం 06 మార్చి 2021
Badradri-kothagudem - Jan 21, 2021 , 02:33:28

రైల్వే లైన్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి

రైల్వే లైన్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి

కొత్తగూడెం టౌన్‌, జనవరి 20: జిల్లాలోని పాండురంగాపురం నుంచి సారపాకకు సర్వే చేసిన 15.5 కిలోమీటర్ల రైల్వేలైన్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ‘దిశ’ కమిటీ సభ్యుడు కొదమసింహం పాండురంగాచార్యులు అధికారులను కోరారు. బుధవారం కలెక్టరేట్‌లో డీఆర్‌వో అశోక్‌చక్రవర్తిని కలిసి వినతి పత్రం అందించారు. బూర్గంపాడు-సారపాకలో ఉన్న ఐటీసీ పేపర్‌బోర్డు వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులు, ఐటీసీ భద్రాచలం నుంచి వెలువడే విషవాయువుల వల్ల ప్రజానీక ఆవశ్యకతకు, పంట పొలాలకు కలిగే నష్టం తదితర వాటి గురించిఆయన వివరించారు. రైల్వేలైన్‌ సాధన కమిటీ సభ్యులు ఉన్నారు.

VIDEOS

logo