గురువారం 03 డిసెంబర్ 2020
Badradri-kothagudem - Nov 19, 2020 , 03:43:00

ప్రజలకు అందుబాటులో ఉంటా

ప్రజలకు అందుబాటులో ఉంటా

టీఆర్‌ఎస్‌ నాయకుడు వనమా రాఘవ 

కొత్తగూడెం : టీఆర్‌ఎస్‌ పార్టీలో కార్యకర్తలందరికీ అందుబాటులో ఉంటూ, ప్రజా సేవకు తనవంతు కృషి చేస్తాననని టీఆర్‌ఎస్‌ నాయకుడు వనమా రాఘవ అన్నారు. బుధవారం ఆయన నమస్తే తెలంగాణతో మాట్లాడుతూ.. కొత్తగూడెం నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ పార్టీని గడప గడపకూ తీసుకెళ్తానన్నారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉండగానే తెలంగాణ రాష్ట్రం కోసం జైలుకు వెళ్లినట్లు ఆయన తెలిపారు. తన తండ్రి కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అడుగు జాడల్లో నడుస్తూ ప్రజాసేవలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నానని అన్నారు. కరోనా సమయంలో 60 వేల మందికి నిత్యావసరరాలు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు.

ఎలాంటి పదవులు ఆశించకుండా ప్రజాసేవలో అంకితమవుతున్నానని, ఎన్నికలు ఏవి వచ్చినా ఎమ్మెల్యే వనమాకు అండగా ఉంటున్న కార్యకర్తలకు నేనున్నానంటూ ముందుకు వెళుతున్నానని అన్నారు. విద్యార్థి విభాగం నుంచే రాజకీయ అనుభవం ఉండడంతోనే నియోజకవర్గంలో ప్రతి ఒక్కరి సమస్యపై అవగాహన ఉందని, వాటిని పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తున్నానని అన్నారు. ప్రతి పుట్టిన రోజుకి అన్నదానాలు, రక్తదానాలు చేస్తున్నామని, అదే స్ఫూర్తితో గురువారం కూడా కార్యకర్తలు అన్నదానాలు, రక్తదానాలు చేస్తున్నామని అన్నారు.