సోమవారం 26 అక్టోబర్ 2020
Badradri-kothagudem - Sep 29, 2020 , 00:31:05

నల్లనేలకు గోదావరి జలాలు

 నల్లనేలకు  గోదావరి జలాలు

  •  సీతారామ ప్రాజెక్టు రెండో దశలో ఇల్లెందుకు ప్రాధాన్యం
  • రాజధానిలో ప్రాజెక్టుపై సమీక్ష  సమావేశంలో మంత్రుల నిర్ణయం
  • డీపీఆర్‌కు ఆదేశం 
  • అన్నదాతల్లో హర్షాతిరేకాలు 

వర్షాధారంగా సాగు చేసుకుంటున్న మన్యం రైతుల చెంతకు ఏకంగా గోదావరి జలాలు తీసుకువచ్చేందుకు సీఎం కేసీఆర్‌ నిర్మిస్తున్న ప్రాజెక్టు ‘సీతారామ లిఫ్ట్‌ ఇరిగేషన్‌'.. ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు మహబూబాబాద్‌ జిల్లాకూ ఇదే  జల ప్రదాయని కానుంది.. ప్రాజెక్టు ఫేజ్‌-2ను ఇల్లెందు ఏరియా వరకు విస్తరింపజేస్తే ఏజెన్సీ సస్యశ్యామలమవుతుందని ఎమ్మెల్యే హరిప్రియానాయక్‌ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విన్నవించగా ఆయన తక్షణం స్పందించారు.. వెనువెంటనే రెండో దశ విస్తరణకు అనుమతులు మంజూరు చేశారు.. ఇప్పటికే సంబంధిత అధికారులు, ఎమ్మెల్యేలతో మంత్రులు పువ్వాడ అజయ్‌కుమార్‌, సత్యవతి రాథోడ్‌ సమావేశం కూడా నిర్వహించారు..   

- ఇల్లెందు రూరల్‌


ఇల్లెందు రూరల్‌: వర్షం ఆధారంగా వ్యవసాయం చేసుకుంటున్న మన్యం రైతుల చెంతకు ఏకంగా గోదావరి జలాలను తరలించే బృహత్తర పథకం సీతారామ ప్రాజెక్టు. ఫేజ్‌-1 డిజైన్‌లో స్వల్ప మార్పుల చోటుచేసుకోవడంతో ఇల్లెందు మన్యం వాసులు నిరాశకు గురయ్యారు. ఇటువంటి స్థితిలో ఇల్లెందు మన్యం పొలం గట్లను గోదావరి జలాలు ముద్దాడుతాయని కలలో కూడా ఎవరూ ఊహించి ఉండరు. కానీ రైతు పక్షపాతిగా వేనోళ్ల నీరాజనాలు అందుకుంటున్న సీఎం కేసీఆర్‌ ఇల్లెందు వాసులకు అపర భగీరథుడిగా మారి సీతారామ ప్రాజెక్టు ఫేజ్‌-2లో వరాల జల్లు కురిపించారు. స్థానిక ఎమ్మెల్యే బానోత్‌ హరిప్రియ విజ్ఞప్తితో స్పందించిన సీఎం కేసీఆర్‌.. రెండో దశకు అనుమతులు మంజూరు చేస్తూ సంబంధిత అధికారులు, ఎమ్మెల్యేలతో సమీక్ష సమావేశం నిర్వహించాలని మంత్రులు పువ్వాడ అజయ్‌కుమార్‌, సత్యవతి రాథోడ్‌లను ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర రాజధానిలో నిర్వహించిన సమావేశంలో ప్రాజెక్టు రెండో దశ డీపీఆర్‌కు అంగీకారం కుదరడం, అందులో ఇల్లెందు ఏజెన్సీలో ప్రతి ఎకరాకూ గోదావరి జలాలు అందేలా ప్రణాళిక ఉండడం పట్ల సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

చీమలపాడు నుంచి ఇల్లెందు మన్యానికి..

సీతారామ ప్రాజెక్టు ఫేజ్‌-1 ప్రణాళికలో భాగంగా ఖమ్మం జిల్లా చీమలపాడు మీదుగా ఇల్లెందు మండలం సరిహద్దున గల లలితాపురం చెరువు వరకు గోదావరి జలాలు చేరనున్నాయి. ఇక్కడి నుంచి నీటిని పంపింగ్‌ ద్వారా ఇల్లెందు ఏజెన్సీకి తరలించేలా రెండో దశ ప్రణాళికలో అధికారులు పొందుపర్చారు. ఇదే విషయమై సీఎం కేసీఆర్‌ హామీ మేరకు ఎమ్మెల్యే హరిప్రియ మండలంలోని రైతు ప్రతినిధులతో ప్రత్యేకంగా సర్వే చేపట్టారు. ఇంజినీరింగ్‌ అధికారులతో సంప్రదించి ఎత్తుపల్లాలను బేరీజు వేసుకుంటూ నీటిని తరలించాల్సిన మార్గాన్ని రైతు ప్రతినిధులు అన్వేషించారు. ఏ మార్గంలో నీటిని తరలిస్తే అత్యధిక ప్రాంతానికి నీటి ఉపయోగకరంగా ఉంటుందనే విషయమై ప్రణాళికలు రూపొందించారు. ఇదే విషయమై ఎమ్మెల్యే బానోత్‌ హరిప్రియ మన్యం ప్రాంతానికి చెందిన రైతులతో చర్చించి సమగ్ర నివేదికను సిద్ధం చేసుకున్నారు. ఇదే నివేదికను సీఎం కేసీఆర్‌కు అందజేసి సీతారామ ప్రాజెక్టు ఇల్లెందు ఏజెన్సీకి వచ్చేలా చేసిన కృషి తాజాగా నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంతో సఫలీకృతమైంది. 

చీమలపాడు నుంచి ఇల్లెందు మన్యానికి..

సీతారామ ప్రాజెక్టు ఫేజ్‌-1 ప్రణాళికలో భాగంగా ఖమ్మం జిల్లా చీమలపాడు మీదుగా ఇల్లెందు మండలం సరిహద్దున గల లలితాపురం చెరువు వరకు గోదావరి జలాలు చేరనున్నాయి. ఇక్కడి నుంచి నీటిని పంపింగ్‌ ద్వారా ఇల్లెందు ఏజెన్సీకి తరలించేలా రెండో దశ ప్రణాళికలో అధికారులు పొందుపర్చారు. ఇదే విషయమై సీఎం కేసీఆర్‌ హామీ మేరకు ఎమ్మెల్యే హరిప్రియ మండలంలోని రైతు ప్రతినిధులతో ప్రత్యేకంగా సర్వే చేపట్టారు. ఇంజినీరింగ్‌ అధికారులతో సంప్రదించి ఎత్తుపల్లాలను బేరీజు వేసుకుంటూ నీటిని తరలించాల్సిన మార్గాన్ని రైతు ప్రతినిధులు అన్వేషించారు. ఏ మార్గంలో నీటిని తరలిస్తే అత్యధిక ప్రాంతానికి నీటి ఉపయోగకరంగా ఉంటుందనే విషయమై ప్రణాళికలు రూపొందించారు. ఇదే విషయమై ఎమ్మెల్యే బానోత్‌ హరిప్రియ మన్యం ప్రాంతానికి చెందిన రైతులతో చర్చించి సమగ్ర నివేదికను సిద్ధం చేసుకున్నారు. ఇదే నివేదికను సీఎం కేసీఆర్‌కు అందజేసి సీతారామ ప్రాజెక్టు ఇల్లెందు ఏజెన్సీకి వచ్చేలా చేసిన కృషి తాజాగా నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంతో సఫలీకృతమైంది. 

గ్రావిటీ ద్వారానే నీటి సరఫరాకు ప్రాధాన్యం

సీతారామ ప్రాజెక్టు ద్వారా ఇల్లెందు ఏజెన్సీకి చేరుకునే గోదావరి జలాలు అత్యధిక ప్రాంతం గ్రావిటీ ద్వారానే సరఫరా అయ్యే అవకాశం ఉంది. మండల సరిహద్దులోని లలితాపురం వరకు ఫేజ్‌-1లో గోదావరి జలాలు చేరుకుంటాయి. ఇక్కడి నుంచి సుదిమళ్ల పెద్ద చెరువుకు, అక్కడి నుంచి పూబెల్లి పెద్దచెరువుకు పంపింగ్‌ ద్వారా నీటి సరఫరా జరుగుతుంది. పూబెల్లి నుంచి కొంతదూరం నీటిని పంపింగ్‌ చేస్తే అటవీ ప్రాంతం గుండా గ్రావిటీ ద్వారా మామిడిగూడెం పెద్దచెరువుకు గోదావరి జలాలు చేరుకుంటాయి. ఈ చెరువుకు అత్యంత సమీపంలోని గుట్టల చెరువుకు నీటిని పంపింగ్‌ చేస్తారు. ఈ చెరువు నుంచి గ్రావిటీ ద్వారా కొమరారం గ్రామ శివారులోని బందంకుంట చెరువుకు నీరు చేరుకుంటుంది. ఈ చెరువు అలుగునీరు మాణిక్యారం గ్రామ పంచాయతీలోని మస్సివాగుకట్ట చెరువుకు నీరు చేరుకుంటుంది. ఈ చెరువు అలుగు నీరు తరలివెళ్లే మస్సివాగు బయ్యారం పెద్దచెరువుకు ప్రధాన నీటి వనరు. అంటే గ్రావిటీ ద్వారా మాణిక్యారం నుంచి బయ్యారం వరకు గోదావరి జలాలు చేరుకుంటాయి. ఇదిలా ఉండగా మామిడిగూడెం పెద్దచెరువు నుంచి గ్రావిటీ ద్వారా కొమ్ముగూడెం గ్రామ పంచాయతీ నాయకులగూడెం పెద్దచెరువుకు నీరు చేరుకుంటుంది. ఈ చెరువు నుంచి గ్రావిటీ ద్వారా పూసపల్లి గ్రామం మీదుగా లచ్చగూడెం పెద్దచెరువుకు నీరు చేరుకుంటుంది. ఈ చెరువు అలుగు నుంచి జాలువారే నీరు నేరుగా చల్లసముద్రం పెద్దచెరువుకు చేరుకుంటుంది. తద్వారా మండలంలో 80 శాతం మేర పంట చేలకు సీతారామ ప్రాజెక్టు ఫేజ్‌-2 ద్వారా గోదావరి జలాలు అందే అవకాశం ఏర్పడుతుంది.

కోనసీమ మరింపచనున్న ఇల్లెందు ఏజెన్సీ

మిషన్‌ కాకతీయ పథకం ఫలాలతో చిన్ననీటి వనరులు నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుకున్నాయి. రైతులకు అదెరువుగా కొనసాగుతున్నాయి. ఇవిపోను అత్యధిక ప్రాంతం వర్షాధారమే. సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్న హరితహారం పుణ్యాన గడిచిన రెండేళ్ళుగా వర్షాపాతం అత్యధికంగా నమోదవుతూ వస్తోంది. దీనికితోడు నిరంతర విద్యుత్తు రైతులకు వరంలా మారింది. దీంతో గతంకంటే కొంత మెరుగ్గా అన్నదాతలు వ్యవసాయం చేసుకుంటున్నారు. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో గోదావరి జలాలు అనుకున్న మార్గంలో ఇల్లెందు ఏజెన్సీకి తరలివస్తే మన్యం మొత్తం మరో కోనసీమను మరిపిస్తుందనడంలో సందేహం లేదని అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సాగునీటి సౌకర్యం మా చిరకాల వాంఛ


నీటి వనరు సరిగా లేకపోవడంతో చల్లసముద్రం పెద్దచెరువు అరుదుగా అలుగుపోస్తుంది. ఇలాంటి చెరువు కింద పండుతాయో లేదో అన్న మీమాంసతో వరణుడిపై భారం వేసి ఏటా సాగు చేస్తున్నాం. ఈ కారణంగా అన్ని ప్రాంతాల్లో పంటలు సమృద్ధిగా పండినా మా ప్రాంతంలో కరువు విలయతాండవం చేస్తుంది. తాజాగా ఎమ్మెల్యే హరిప్రియ కృషితో గోదావరి జలాలు పెద్ద చెరువుకు చేరుకునే ప్రక్రియకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం ఆనందంగా ఉంది. ఈ ప్రాంత రైతులు సీఎం కేసీఆర్‌కు ఎల్లవేళలా రుణపడి ఉంటారు.

-బండారు వెంకన్న, రైతు, చల్లసముద్రం గ్రామం, ఇల్లెందు మండలం

మన్యం భూములకు మంచి రోజులు

నీటి వనరులు సరిగా లేక వర్షాధారంపై ఆధారపడి సాగు చేసుకుంటున్న మన్యం రైతులకు మంచి రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను ఇల్లెందు మన్యానికి తరలించే ప్రక్రియపై ప్రణాళిక రూపొందడం ఆనందంగా ఉంది. మా ఆకాంక్షను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే హరిప్రియకు, సానుకూలంగా స్పందించి మా ఆశలకు కార్యరూపం ఇస్తున్న సీఎం

-నూనావత్‌ లష్కర్‌, రైతు, మాణిక్యారం, ఇల్లెందు మండలం

  logo