ఆదివారం 29 నవంబర్ 2020
Badradri-kothagudem - Sep 04, 2020 , 01:07:26

బేతంపూడి రైతుకు రాష్ట్రస్థాయి అవార్డు

బేతంపూడి రైతుకు రాష్ట్రస్థాయి అవార్డు

టేకులపల్లి : కృషి విజ్ఞాన కేంద్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దత్త గ్రామం బేతంపూడికి చెందిన బచ్చలకూరి అశోక్‌ అనే రైతు 2020 సంవత్సరానికి రాష్ట్రస్థాయి ఉత్తమ రైతు అవార్డుకు ఎంపికయ్యారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్‌ ప్రవీణ్‌రావు చేతుల మీదుగా గురువారం అవార్డు పొందారు. ఈ సందర్భంగా కేవీకే కొత్తగూడెం ప్రోగ్రాం కో ఆర్డినేటర్‌ డా.జి.వీరన్న మాట్లాడుతూ వ్యవసాయ పంటలతో పాటు  కృషి విజ్ఞాన కేంద్రం సూచించే కొత్తకొత్త టెక్నాలజీని అవలంబిస్తూ మంచి దిగుబుడులు సాధిస్తున్నారన్నారు. అవార్డు అందుకున్న ఆశోక్‌ని కేవికే వారు అభినందించారు. ఎంపిక చేసిన పీజెటీఎస్‌ఏయూ, వి.ప్రవీణ్‌ రావుకి కృతజ్ఞతలు తెలిపారు.