ఆదివారం 29 నవంబర్ 2020
Badradri-kothagudem - Feb 03, 2020 , 03:39:07

రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత

రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత

రఘునాథపాలెం:రోడ్డు ప్రమాదాలను నివారిం చేం దుకు వాహనదారులు భద్రతా నిబంధ నలను తప్పనిసరిగా పాటించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ అన్నారు. 31వ రోడ్డు భద్రతా వారోత్సవాల ముగింపు కార్య క్రమం ఆదివారం జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో జరిగింది. దీనికి మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా ఖమ్మం పెవిలియన్‌ గ్రౌండ్‌ నుంచి జిల్లా రవాణా శాఖ కార్యాలయం వరకు జరిగిన మోటార్‌ సైకిల్‌ అవగాహన ర్యాలీలో  మంత్రి హెల్మట్‌ ధరించి పాల్గొన్నారు. ఈ ర్యాలీని ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ ఆర్జేసీ కృష్ణ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆర్టీవో కార్యాలయంలో జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. సమాజ భద్రత, కుటుంబ భద్రత మన చేతుల్లోనే ఉందని, వాహనాలను నడిపే సమయంలో భద్రతా నిబంధనలను పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌, మద్యం తాగి వాహనాలను నడపడం, అతి వేగంగా , పరిమితికి మించి ప్రయాణికులతో వాహనా లను నడపడం వలన ప్రమాదాలు సంభవిస్తున్నా య న్నారు. చిన్నపాటి జాగ్రత్తలను తీసుకోకపోవడం వల్లనే అనేక మంది ప్రమాదాలకు గురై ప్రాణాలను కోల్పోతున్నారన్నారు. వాహన చోధకుల భద్రత వారి చేతుల్లోనే ఉందని, హెల్మెట్‌, సీట్‌ బెల్ట్‌ ధరించడంతో ప్రమాదాలు తగ్గుముఖం పడుతాయ న్నారు. మద్యం తాగి వాహనాలను నడిపినట్లయితే తమతో పాటు ఎదుటి వారికి సైతం ప్రమాదాలు జరుగుతాయన్నారు. రోడ్డు ప్రమాదాల వల్ల ప్రతి ఏటా సుమా రు నాలుగు లక్షల మంది క్షతగాత్రులు అవుతున్నారన్నారు. రాష్ట్రంలో మొత్తం ఒక కోటి ఇరవై ఐదు లక్షల వాహనాలు ఉండగా వాటిలో 91లక్షలు ద్విచక్ర వాహనాలు ఉన్నాయని, 15లక్షల కార్లు, వివిధ ట్యాక్సీ వాహనాలు ఉండగా, 10వేల ఆర్టీ సీ బస్సులు ఉన్నట్లు మంత్రి తెలిపారు. పోలీసు, రవా ణా శాఖ ప్రమాదాల నివారణకు అనేక అవగా హన కార్యక్రమాలు చేపడుతుందని, ప్రజలు తమ బాధ్యతలను గుర్తెరిగి ట్రాఫిక్‌ రోడ్డు నిబంధనలను కచ్చితంగా పాటించాలని మంత్రి అన్నారు. ప్రపంచం మొత్తంలో జరుగుతున్న ప్రమాదాలలో 11శాతం ప్రమాదాలు మన దేశంలోనే సంభవి స్తున్నాయన్నారు. 

సురక్షిత ప్రయాణానికి భరోసా రాష్ట్ర రవాణాశాఖ..

         రాష్ట్రంలో అత్యంత సురక్షితమైన భద్రత పాటించే సంస్థ టీఎస్‌ఆర్‌టీసీ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ అన్నారు. బస్సుల లో ప్రయాణికులు నిశ్చింతగా తమ గమ్యాలకు చేరుకోవచ్చుననే భావనతో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నారని, రవాణాశాఖలో అనేక సంస్కరణలను తీసుకవస్తున్నామని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. అనంతరం నగర మేయర్‌ డాక్టర్‌ గుగులోతు పాపాలాల్‌ మాట్లాడుతూ..వాహనాన్ని నడిపేవారు భద్రత నిబంధనలను తెలుసుకోక పోవడం వల్లనే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. తప్పనిసరిగా నిబంధనలను పాటించాలని ఆయన సూచించారు. జేసీ హన్మంత్‌ కొడింబా మాట్లాడుతూ..రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాల ద్వారా ద్విచక్ర వాహనాలతో పాటు ఆటో, బస్సు, లారీ ఇతర డ్రైవర్లు ట్రా ఫిక్‌ రోడ్డు భద్రతా నిబంధనలను సక్రమంగా అవగాహన చేసుకోవాలని, తమతో పాటు తమ కు టుంబ సభ్యులు ఎదుట ప్రయాణికుల భద్రత గురిం చి ఆలోచన చేయాలని తద్వారా రోడ్డు ప్రమాదానలు పూర్తిగా నివారించగలుగుతామని ఆయన అన్నారు. ఈ సందర్భంగా  29ఏళ్లుగా ఒక్క ప్రమా దం కూడా జరక్కుండా ఆర్టీసీ బస్సులను నడిపిన రీజనల్‌ స్థాయి ప్రమాదరహిత డ్రైవర్లు ఎండీ షరీఫ్‌, ఎంఎస్‌ రావు, వై వెంకటేశ్వర్లుకు నగదు పురస్కారం, ప్రశంసా పత్రాలను మంత్రి అందజేశారు.  ఆర్టీవో బీమిరెడ్డి కృష్ణారెడ్డి వాహనదారులతో రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌టీసీ రీజనల్‌ మేనేజర్‌ కృష్ణమూర్తి, ఆర్డీవో రవీద్రనాథ్‌, డిప్యూటీ మేయర్‌ బత్తుల మురళీ, కార్పొరేటర్లు పగడాల నాగరాజు, కమర్తపు మురళీ, కే భాస్కర్‌రావు, సీనియర్‌ మోటార్‌ వెహికి ల్‌ ఇన్‌స్పెక్టర్‌ శంకర్‌నాయక్‌, ఏఎంవీఐ కిషోర్‌ బాబు, లారీ, ఆటో, బస్సు యూనియన్ల ప్రతిని ధులు, డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.