e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, December 3, 2021
Home ఏపీ ఏపీ శాసనమండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌గా జకియాఖానమ్‌..

ఏపీ శాసనమండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌గా జకియాఖానమ్‌..


అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌గా వైసీపీ ఎమ్మెల్సీ జకియా ఖానమ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏపీలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా గురువారం డిప్యూటీ చైర్మన్‌ పదవికి నామినేషన్‌ వేసిన ఆమెకు పోటీగా ఎవరూ లేకపోవడంతో శుక్రవారం ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. దీంతో శుక్రవారమే ఆమెచేత ప్రమాణస్వీకారం చేయించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆమెను స్వయంగా కూర్చీ వద్దకు తీసుకెళ్లారు.

అనంతరం జకియా ఖాన్‌ మాట్లాడుతూ.. ఓ మైనార్టీ మహిళను డిప్యూటీ చైర్మన్‌ను చేసిన సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. మహిళాభ్యున్నతికి జగన్‌ పాటుపడుతున్నారని , సాధారణ గృహిణిగా ఉన్న తనకు సముచిత స్థానాన్ని కల్పించినందుకు మైనార్టీలందరూ హర్షించారని ఆమె పేర్కొన్నారు. ఈమె భర్త ఎం. అప్జల్‌ఖాన్‌ వైఎస్సార్‌ జిల్లా రాయకోటికి చెందిన మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా, వైసీపీ నాయకుడిగా పనిచేస్తూ దివంగతుడయ్యారు. వీరికి ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. గత యేడాది ఆగస్టులో సీఎం జగన్‌ ఆమెను ఎమ్మె ల్సీగా నియమించారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement