అమరావతి : ప్రభుత్వ మెడికల్ కళాశాలలను( Medical Colleges) పీపీపీ ( పబ్లిక్, ప్రైవేట్, పార్టనర్షిప్) విధానంలో కొనసాగించాలని నాడు పార్లమెంట్ కమిటీలో సంతకాలు చేసిన వైసీపీ సభ్యులు నేడు వ్యతిరేకిస్తున్నారని టీడీపీ నాయకుడు పట్టాభిరామ్ ( TDP leader Pattabhiram ) మండిపడ్డారు. గురువారం మంగళగిరి టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా పీపీపీ విధానానికి మద్దతు తెలుపుతూ కమిటీలో పలు జాతీయ పార్టీలతో పాటు వైసీపీ సభ్యులు గురుమూర్తి కూడా విషయాన్ని ఆయన స్క్రీన్‌లో ప్రదర్శించారు. పట్టాభిరామ్ మాట్లాడుతూ అధికారంలో ఉన్నప్పుడు ఒకమాట లేనప్పుడు మరో మాట మాట్లాడడం జగన్‌కు అలవాటుగా మారిందని దుయ్యబట్టారు.
17 మెడికల్ కళాశాల నిర్మాణానికి సుమారు 8 వేల కోట్లు మంజూరు చేశారని, దురదృష్టవ శాత్తు ప్రభుత్వం కోల్పోవడంతో ఆ నిధులు కాజేయడానికి అవకాశం లేకపోవడంతో కూటమి ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
పీపీపీ విధానం వల్ల పేద రోగులకు, మెడికల్ విద్యను చదువుకోవాలనే ఆశపడే పేద విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.ఇప్పటికి వైసీపీ హయాంలో ప్రారంభించిన పనులు మొండి గోడలకే పరిమితమయ్యాయని ఆరోపించారు.
మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చేసిన కోటి సంతకాలు దొంగ సంతకాలనేనని విమర్శించారు. వైసీపీ హయాంలో 108, 104 అంబులెన్స్‌లను పీపీపీ విధానంలో అరబిందో కంపెనీకి అప్పగించారని గుర్తు చేశారు. మెడికల్ కళాశాలలకు ప్రభుత్వ మెడికల్ కళాశాల అనే పేరుంటుందని వెల్లడించారు.