‘తిరుపతి’లో వైసీపీకి తిరుగులేదు.. లక్ష దాటిన మెజారిటీ
లక్ష దాటిన మెజారిటీ| ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి ఉపఎన్నికలో వైఎస్ఆర్సీపీ తిరుగులేని ఆధిక్యత కొనసాగిస్తున్నది. కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ముందంజలోనే కొనసాగుతున్నది. ప్రతి రౌండ్లో మెజారిటీ సాధిస్తూ భారీ ఆధిక్యం

తిరుపతి: ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి ఉపఎన్నికలో వైఎస్ఆర్సీపీ తిరుగులేని ఆధిక్యత కొనసాగిస్తున్నది. కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ముందంజలోనే కొనసాగుతున్నది. ప్రతి రౌండ్లో మెజారిటీ సాధిస్తూ భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతున్నది. ఇప్పటివరకు వైసీపీ అభ్యర్థి గురుమూర్తి 1,24,119 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. వైసీపీకి 2,50,424 ఓట్లు పోలవగా, టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మికి 1,33,613 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థికి 23,223 ఓట్లు పోలయ్యాయి.
వైసీపీ అభ్యర్థి గురుమూర్తి మొదటి రౌండ్ నుంచి ఆధిక్యంలోనే కొనసాగుతున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో 2500 ఓట్ల లీడ్‌లో ఉన్నారు. తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్ మొదటి రౌండ్లో 3,817, శ్రీకాళహస్తిలో 1940, సత్యవేడులో 1907 ఆధిక్యంలో ఉంది.
కౌంటింగ్ సందర్భంగా తిరుపతి శాసనసభ నియోజకవర్గంలో 14 రౌండ్లు, సూళ్లూరుపేట నియోజకవర్గంలో గరిష్టంగా 25 రౌండ్లు కౌంటింగ్ జరగనుంది. వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మృతితో తిరుపతి లోక్‌సభకు ఏప్రిల్ 17న ఉపఎన్నిక జరిగిని విషయం తెలిసిందే.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
‘బెంగాల్ పులి’కి అభినందనలు: సంజయ్ రౌత్
బెంగాల్లో మమత గెలిస్తే.. మోదీ, షా ఓడినట్లే: సంజయ్ రౌత్
ప్రధాని వెక్కిరింతలకు సరైన సమాధానం: అఖిలేశ్ యాదవ్
నందిగ్రామ్‌లో మళ్లీ వెనుకంజలో మమతా బెనర్జీ
దేశంలో కఠిన లాక్డౌన్ అవసరం: ఎయిమ్స్ చీఫ్ రణ్‌దీప్ గులేరియా
నందిగ్రామ్‌లో మళ్లీ వెనుకంజలో మమతా బెనర్జీ
మమతదే ఈ విజయం.. ఆత్మపరిశీలన చేసుకుంటాం: బీజేపీ ప్రధాన కార్యదర్శి
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

