దేశంలో కఠిన లాక్డౌన్ అవసరం: ఎయిమ్స్ చీఫ్ రణ్‌దీప్ గులేరియా

ఢిల్లీ,మే 2: ఆరోగ్య మౌలిక సదుపాయాల కొరత ఏర్పడుతున్న నేపథ్యంలో కఠిన లాక్డౌన్ అవసరమని ఎయిమ్స్ చీఫ్ డా.రణ్‌దీప్ గులేరియా అభిప్రాయపడ్డారు. కరోనా కేసులు పెరుగుతుండడంతో దేశంలో పరిస్థితులు దారుణంగా మారాయని.. రాత్రి కర్ఫ్యూలు, వారాంతపు లాక్డౌన్లతో పెద్దగా ఉపయోగం లేదని.. గతేడాది మార్చిలో విధించిన తరహాలో కఠిన లాక్డౌన్ అవసరమన్నారు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, హరియాణా, తెలంగాణ వంటి రాష్ట్రాలు రాత్రి కర్ఫ్యూ, వారాంతపు లాక్డౌన్ విధిస్తున్నా అవి అంతగా ప్రభావం చూపలేకపోతున్నాయనే విషయం స్పష్టమవుతోందని ఆయన పేర్కొన్నారు.
దేశంలో వైద్య సదుపాయాల కొరత ఏర్పడుతోందని..ఢిల్లీలోని బాత్రా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 12 మంది మరణించడం, అందులో ఓ వైద్యుడు ఉండటం అత్యంత బాధాకరమని గులేరియా విచారం వ్యక్తం చేశారు. విద్యార్థిగా ఉన్నప్పటి నుంచే ఆ వైద్యుడు తనకు తెలుసన్నారు.

ఆసుపత్రుల్లో ఆరోగ్య సదుపాయాలతో పాటు సిబ్బంది కూడా తగ్గిపోతున్నారని.. ఇలాంటి సమయంలో అప్రమత్తంగా లేకపోతే పరిస్థితులు చేయిదాటిపోతాయని ఆయన హెచ్చరించారు. ‘ఆసుపత్రుల్లో రోగులు పెరిగిపోతుండటంతో వైద్యులు, సిబ్బందిపై ఒత్తిడి పెరిగిపోతోంది. ప్రపంచంలోని ఏ ఆరోగ్య వ్యవస్థ కూడా ఈ తరహా పనిభారాన్ని మోయదు. కేసులను తగ్గించేందుకు కఠిన లాక్డౌన్ విధించడం లేదా ఇంకేదైనా మార్గముంటే అమల్లోకి తీసుకురావాలి’ అని సూచించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

