అమరావతి : తిరుమల లడ్డూ ( Tirupati Laddus ) లో జంతువుల కొవ్వు కలిసిందంటూ చంద్రబాబు, పవన్ కల్యాణ్ చేసిన తప్పుడు ఆరోపణలపై వైసీపీ ( YSRCP ) శనివారం పాప ప్రక్షాళన పూజలు నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా వేంకటేశ్వరస్వామి ఆలయాల్లో ( Temples ) ఈ కార్యక్రమాలను నిర్వహించింది .
ఎన్టీఆర్ జిల్లాలో వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కూటమి నేతలు హిందువుల మనోభావాలతో ఆటలు ఆడుకున్నారని ఆరోపించారు. జంతువుల కొవ్వు కలపలేదని సీబీఐ కూడా తేల్చి చెప్పిందని అన్నారు. రాష్ట్ర ప్రజలకు సీఎం, డిప్యూటీ సీఎం , మంత్రులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు
. విశాఖపట్నం సీతమ్మధార వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, మాజీ మేయర్ హరి వెంకట కుమారి ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. తిరుపతి లడ్డూపై తప్పుడు ప్రచారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమికి మంచి బుద్ది ప్రసాదించాలని వేడుకున్నారు.