YS Jagan | వైసీపీ అధినేత వైఎస్ జగన్ పులివెందుల పర్యటన రద్దయ్యింది. ఈ నెల 21, 22వ తేదీల్లో అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో రేపటి పులివెందుల పర్యటనను జగన్ వాయిదా వేసుకున్నారు.
ముందుగా ఈ నెల 24వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ఏపీలోని కూటమి ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల కంటే ముందు పులివెందుల పర్యటనకు వెళ్లి రావాలని జగన్ అనుకున్నారు. కానీ అసెంబ్లీ సమావేశాలను ఈ నెల 21, 22వ తేదీల్లోనే నిర్వహించాలని తాజాగా ఏపీ ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. సభ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కూడా సమాచారం. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల కంటే ముందే వైసీపీ నాయకులతో సమావేశం కావాలని నిర్ణయించిన జగన్.. తన పర్యటనను వాయిదా వేసుకున్నారు. ఈ క్రమంలో ఈ నెల 20న వైసీపీ నాయకులతో జగన్ భేటీ కానున్నారు. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఈ సమావేశానికి హాజరుకావాలని పార్టీ అధిష్ఠానం ఆదేశాలు జారీ చేసింది.