అమరావతి : అక్రమాస్తుల కేసులో ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ( YS Jagan) అభ్యర్థనను సీబీఐ కోర్టు ( CBI Court ) తిరస్కరించింది. దీంతో తాను వ్యక్తిగతంగా కోర్టుకు హాజరవుతానని ఆయన స్పష్టం చేశారు. అక్రమాస్తుల కేసు నడుస్తుండగా యూరప్ పర్యటననను వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చి షరతులు విధించింది.
ఈనెల 14న సీబీఐ కోర్టు ముందు వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని న్యాయమూర్తి గతంలో ఆదేశాలు జారీ చేశారు. జగన్ మాత్రం భద్రతా కారణాల రీత్యా ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సి ఉన్నందున తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ కోర్టులో మెమో దాఖలు చేశారు. లేకపోతే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అయినా కోర్టు విచారణకు హాజరవుతానని వెల్లడించారు.
యూరప్ టూర్ లో తన ఫోన్ నంబర్ ఇవ్వకుండా మరో నంబర్ ఇచ్చారని, ఆయనకు గతంలో ఇచ్చిన బెయిల్ షరతులు ఉల్లంఘించినందున దాన్ని రద్దు చేయాలని ఇటీవల సీబీఐ కోర్టును కోరింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు మినాహాయింపును తిరస్కరిస్తూ మరో మరో రోజుల గడువు ఇచ్చింది. ఈనెల 21న కోర్టుకు హాజరు కావాలంటూ ఆదేశాలు జారీ చేయడంతో వ్యక్తిగతంగా హాజరయ్యేందుకు జగన్ సుముఖత వ్యక్తం చేశారు.