హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ) : ప్రతిపక్ష హోదా ఇవ్వకుంటే అసెంబ్లీకి వచ్చేది లేదని వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టంచేశారు. అసెంబ్లీకి హాజరుపై గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు. మాట్లాడటానికి సమయం ఇస్తేనే కదా అసెంబ్లీకి వెళ్లేది.
సాధారణ ఎమ్మెల్యేలా టైమ్ ఇస్తామంటే ఎలా? అని ప్రశ్నించారు. ప్రతిపక్షానికి ఎన్ని సీట్లు ఉన్నా ప్రతిపక్ష హోదా ఇవ్వాలన్నారు.