అమరావతి : మూడు రాజధానుల పేరిట వైఎస్ జగన్ ( YS Jagan ) రుషికొండను మింగేసి సొంతగాప్యాలెస్లు కట్టారని ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ( YS Sharmila ) ఆరోపించారు. అమరావతి రాజధానిపై జగన్ చేస్తున్న వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. వైఎస్ జగన్ మావిగన్ జోకర్ అని ట్విటర్ వేదిక ద్వారా విమర్శించారు.
వారసులం అని చెప్పుకునే జగన్ వైఎస్ఆర్ పేరు వాడుకున్నారని, వైఎస్ఆర్ ఆశయాలకు జగన్ ఎప్పటికీ వారసులు కాలేదని అన్నారు. వైఎస్ఆర్ భావజాలం ఉంటే జలయజ్ఞం ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. వైఎస్ఆర్ వ్యతిరేకించిన బీజేపీకి దత్తపుత్రుడిగా ఎందుకు మారారని ఆరోపించారు. ఎస్సీలు, క్రైస్తవులపై దాడులు జరుగుతుంటే మౌనంగా ఎందుకున్నారని ప్రశ్నించారు.
ఉమ్మడి ఏపీలో వైఎస్ పాదయాత్ర ప్రారంభించి ఇవ్వాళ్టికి 23 ఏళ్ళు. ఏప్రిల్ 9, 2003 లో చేవెళ్ల నుంచి ఇచ్చాపురం దాక ప్రజాహితమే పరమావధిగా సాగిన 1,457 కిలోమీటర్ల పాదయాత్ర కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలోనే కాదు. దేశంలోనూ అధికారంలో తెచ్చిన ఒక శాశ్వత జ్ఞాపకమని అభివర్ణించారు.