YS Jagan Protest | పులివెందుల ఆర్వో కార్యాలయం వద్ద బైఠాయించిన వైఎస్ జగన్
YS Jagan Protest | కడప జిల్లా పులివెందులలో ఎన్నికలు సజావుగా జరగడం లేదని, వైసీపీ ఏజెంట్లు పోలింగ్ బూత్‌లోకి వెళ్లకుండా అడ్డుకున్నారని ఆరోపిస్తూ వైసీపీ అధ్యక్షుడు , మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆదివారం రిటర్నింగ్ అధికారి కార్యాలయం ఎదుట బైటాయించారు.
అమరావతి : కడప జిల్లా పులివెందులలో ఎన్నికలు సజావుగా జరగడం లేదని, వైసీపీ ఏజెంట్లు పోలింగ్ బూత్‌లోకి వెళ్లకుండా అడ్డుకున్నారని ఆరోపిస్తూ వైసీపీ అధ్యక్షుడు , మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ( YS Jagan Mohanreddy ) ఆదివారం పులివెందుల రిటర్నింగ్ అధికారి కార్యాలయం ఎదుట బైటాయించారు.
ఎన్నికల్లో జరుగుతున్న అక్రమాలపై ఆర్వోకు ఫిర్యాదు చేసేందుకు కార్యాలయానికి వెళ్లగా అధికారులు లోనికి అనుమతించ లేదు. దీంతో అధికారులే బయటకు వచ్చి జగన్‌తో మాట్లాడారు. టీడీపీ గూండాల దౌర్జాన్యాలను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. అధికారులు నిష్పక్షపాతంగా, మనస్సాక్షిగా ఎన్నికలు జరుపాలని కోరారు. ఎన్నికలు సజావుగా జరిపి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు.
అంతకుముందు పులివెందుల ( Pulivendula ) లో ఆయన మీడియాతో మాట్లాడారు. పులివెందుల పులివెందులలో 80 పోలింగ్ బూత్‌లు ఉండగా 70 బూతుల్లో వైసీపీ ఏజెంట్లు లేరని ఆరోపించారు. తమ ఏజెంట్లు బూత్‌లోకి రాకుండా అడ్డుకున్నారని విమర్శించారు. పోలీసులు టీడీపీకి సహకరిస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నికలు రద్దు చేసి రీపోలింగ్ ( Repolling Demand ) జరపాలని డిమాండ్ చేశారు.
పులివెందులలో చైర్పర్సన్ అభ్యర్థి ప్రమీల పైనా దాడి చేశారని , ఇదీ ప్రజాస్వామ్యమేనా అంటూ ప్రశ్నించారు. ఓటర్లను అడ్డుకుని ఓటర్ స్లిప్పులు లాక్కున్నారని వెల్లడించారు. మరోసారి సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. కోర్టు ఆదేశాలను ఎస్ఈసీ పాటించడం లేదని ఆరోపించారు. బూత్‌ల్లో వీడియో రికార్డింగ్, సీసీ కెమెరాలు లేవని తెలిపారు. యథేచ్ఛగా దొంగ ఓట్లు వేస్తున్నారని జగన్ ఆరోపించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

