AP News | ఈవీఎంలపై వైసీపీ అధినేత జగన్ వ్యాఖ్యలు హాస్యాస్పదమని బీజేపీ ఏపీ అధికార ప్రతినిధి భానుప్రకాశ్ రెడ్డి అన్నారు. జగన్ తన ఓటమిని ఇప్పటికైనా అంగీకరించాలని హితవు పలికారు. ఐదేళ్లలో ఒక్కరోజైనా ప్రజల కష్టాలపై ఆలోచించారా? అని ప్రశ్నించారు.
ఐదేళ్లు కాదు.. జీవితాంతం కళ్లు మూసుకున్నా జగన్ మళ్లీ సీఎం కాలేరని భానుప్రకాశ్ రెడ్డి విమర్శించారు. తిరుమల పవిత్రతను ధర్మారెడ్డి దెబ్బతీశారని ఆరోపించారు. టీటీడీ సేవా టికెట్ల వ్యవహారంపై జ్యుడీషియల్ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఏ ఒక్కరినీ వదిలిపెట్టమని స్పష్టం చేశారు.