అమరావతి : ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళిని (Posani Krishnamurali ) ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేయడాన్ని వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan ) తీవ్రంగా ఖండించారు. హైదరాబాద్‌లో నిన్న రాత్రి అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులో పోలీసులు అరెస్టు ( Arrest ) చేశారు. ఈ అరెస్టుపై జగన్ స్పందించారు. పోసాని భార్య కుసుమలత ( Wife Kusumalatha ) ను గురువారం ఫోన్లో పరామర్శించి ధైర్యం చెప్పారు.
కూటమి ప్రభుత్వం అరాచకంగా వ్యవహరిస్తుందని, ప్రజలు, దేవుడు అంతా చూస్తున్నారని అన్నారు. పోసానికి అండగా ఉంటామని, పార్టీ తరుఫున న్యాయ సహాయం అందిస్తామని వివరించారు. ఇప్పటికే సీనియర్ న్యాయవాదులకు ( Senior Advocates )బాధ్యతలు అప్పగించామని పేర్కొన్నారు. కష్టకాలంలో మీరు ధైర్యంగా ఉండాలని కోరారు. రాష్ట్రంలో నిరంకుశపాలన ఎక్కువ రోజులు కొనసాగదని జగన్ అన్నారు.
వైసీపీ అధికారంలో ఉండగా కూటమి నాయకులు చంద్రబాబు, నారా లోకేష్, సినీ పరిశ్రమలో వర్గ విభేదాలు సృష్టించేలా ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పోసానిపై జనసేన నేత జోగినేని మణి ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశాడు. జనసేన కార్యకర్త ఫిర్యాదు మేరకు పోసాని కృష్ణ మురళిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు పోసానిని హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకుని అన్నమయ్య జిల్లాకు తరలించి విచారణ చేపట్టారు.