YCP Digital Book | వైసీపీ కార్యకర్తలను కూటమి ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని మాజీ మంత్రి జోగి రమేశ్ అన్నారు. ఏడాది గడిచినా కూటమి నేతలు జగన్నే స్మరిస్తున్నారని అన్నారు. మరో రెండేళ్ల తర్వాత ఎన్నికలకు వెళ్లబోతున్నామని.. అప్పుడు వైసీపీ ప్రభుత్వమే వస్తుందని చెప్పారు.
జగన్ సీఎం కాగానే మొదట తెరిచేది డిజిటల్బుక్నే అని స్పష్టం చేశారు. తప్పు చేసిన వాళ్లు ఎక్కడున్నా తీసుకొచ్చి నిలబెడతారని తెలిపారు.
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ప్రజలను పీడించడానికే అని వైసీపీ సీనియర్ నాయకుడు కురసాల కన్నబాబు విమర్శించారు. రెడ్‌బుక్ కోసం పోలీసులను ఆయుధాలుగా వాడుతున్నారని అన్నారు. కొడుకు తప్పు చేస్తే తప్పని చెప్పాల్సింది పోయి.. చంద్రబాబే ఆయన వేధింపులను నేర్పిస్తున్నారని వ్యాఖ్యానించారు. కార్యకర్తలను కాపాడుకోవడం కోసమే వైఎస్ జగన్ డిజిటల్ బుక్‌ను ప్రవేశపెట్టారని తెలిపారు. ప్రజలకు సంక్షేమం ఇవ్వకుండా వేధింపులకు గురి చేస్తున్నారని అన్నారు. ఫలానా పథకం రాలేదని అడగాలంటే భయపడే పరిస్థితి వచ్చిందన్నారు. ఈ అన్యాయాలు అన్నింటినీ తప్పుకుండా డిజిటల్ బుక్‌లో నమోదు చేస్తామని చెప్పారు.