AP News | పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తోందనే కారణంతో గిరిజన యువతిని ప్రియుడే దారుణంగా హత్య చేసిన ఘటన పార్వతీపురం మన్యం జిల్లాలో వెలుగులోకి వచ్చింది. రెండు రోజుల క్రితం చెరువులో మృతదేహం కనిపించడంతో విచారణ జరిపిన పోలీసులు ఈ కేసును ఛేదించారు. మరో వివాహిత మోజులో పడి, ఆమె కోసమే ప్రియురాలిని హత్య చేసినట్లుగా గుర్తించారు. హత్యతో సంబంధం ఉన్న ముగ్గుర్ని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ మాధవరెడ్డి మీడియాకు వెల్లడించారు.
వివరాల్లోకి వెళ్తే.. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలం బర్న సీతంపేటకు చెందిన గిరిజన యువతి బిడ్డిక ఉషారాణి (32)కి ఎం.సింగుపురం గ్రామానికి చెందిన రెడ్డి భువనేశ్వర్‌కు గత కొన్నేళ్లుగా పరిచయం ఉంది. గత ప్రభుత్వ సమయంలో ఇద్దరూ వాలంటీర్లుగా పనిచేశారు. ఆ సమయంలో ఏర్పడిన స్నేహం కాస్త ప్రేమగా మారింది. అయితే ఇటీవల భువనేశ్వర్‌కు ఎం.సింగుపురం పీహెచ్సీలో స్టాఫ్ నర్స్‌గా పనిచేస్తున్న వీరఘట్టం మండలం బొడ్లపాడుకు చెందిన వివాహిత తీగెల కృపారాణితో సాన్నిహిత్యం ఏర్పడింది.
ఇది గమనించిన ఉషారాణి తనను పెళ్లి చేసుకోవాలని భువనేశ్వర్‌పై ఒత్తిడి తెచ్చింది. దీంతో ఉషారాణిని అడ్డు తొలగించుకోవాలని భువనేశ్వర్ భావించాడు. ఇదే విషయాన్ని కృపారాణికి చెప్పాడు. ఇద్దరూ కలిసి కృపారాణి హత్యకు ప్లాన్ చేశారు. ఈ క్రమంలోనే ఈ నెల 5వ తేదీన ఉషారాణికి భువనేశ్వర్ ఫోన్ చేశాడు. ఒడిశాలోని రాయగడకు వెళ్లాలని చెప్పగా.. 6వ తేదీ ఉదయం ఉషారాణి ఇంటి నుంచి బయల్దేరి డోలమడ సెంటర్‌కు వచ్చింది. భువనేశ్వర్ వరుసగా తమ్ముడైన, అదే గ్రామానికి చెందిన తేజతో లకిసి కారులో అక్కడకు వచ్చారు. వారంతా కలిసి రాయగడకు బయల్దేరారు. ఆ సమయంలో మత్తు మాత్రలు కలిపిన కూల్‌డ్రింక్‌ను ఉషారాణికి ఇచ్చారు. కొద్దిగా తాగిన ఆమె వీరఘట్టం జంక్షన్ వద్ద వాంతులు చేసుకుంది. అక్కడి నుంచి ఎలాగోలా రాయగడకు చేరుకున్నారు. తిరుగు ప్రయాణంలో ఉషారాణి భోజనం చేయడానికి నిరాకరించి, మిగిలిన కూల్‌డ్రింక్‌ను తాగింది. పూర్తిగా మత్తులోకి జారుకుంది. మత్తులో ఉన్న ఉషారాణినిని డోలమడకు తీసుకొచ్చి చంపేయాలని భువనేశ్వర్ అనుకున్నాడు. కానీ ఈలోపే ఉషారాణికి కాస్త మెలకువ రావడం గమనించి కృపారాణికి భువనేశ్వర్ ఈ విషయాన్ని చెప్పాడు. దీంతో బొడ్లపాడు నుంచి ఆమె స్కూటీపై బూర్జ జంక్షన్ వరకూ వచ్చింది. అక
అయితే దొరికిపోతామనే భయంతో భువనేశ్వర్ తన సోదరుడు తేజతో కలిసి మరో కారులో మృతదేహం పడేసిన చోటుకు వెళ్లారు. అక్కడ ఉషారాణి మృతదేహాన్ని కారులో ఎక్కించుకుని నీలంపేట రోడ్డు వద్ద ఉన్న సరిహద్దు సర్వే రాయిని తీసుకున్న వారు, దాన్ని మృతదేహానికి కట్టి పాలకొండ కాంప్లెక్స్ వెనుక ఉన్న చెరువులో పడేయాలని చూశారు. అయితే స్థానికుల సంచారం ఉండటంతో కుదర్లేదు. దీంతో తంపాటపల్లి జంక్షన్ నుంచి చింతాడ రహదారిలో ఉన్న తుమరాడ గ్రామంలోని కామినాయుడు చెరువు వద్దకు చేరుకున్నారు. ఉషారాణి మృతదేహం కాళ్లు, చేతులను తాళ్లతో కట్టి, ఆ తర్వాత సర్వేరాయిని కట్టి చెరువులో పడేశారు. ఆదివారం తెల్లవారుజామున ఇంటికి చేరుకున్నారు.
మరోవైపు ఉద్యోగానికి దరఖాస్తు చేసేందుకు ఈ నెల6వ తేదీన ఇంటి నుంచి వెళ్లిందని.. అప్పటి నుంచి తన కుమార్తె ఉషారాణి కనిపించడం లేదని ఆమె తండ్రి చిన్నారావు ఈ నెల 10వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే రోజు సాయంత్రం 4.30 గంటల సమయంయలో కామినాయుడు చెరువులో మహిళ మృతదేహం ఉన్నట్లు పోలీసులు గుర్తించి ఉషారాణి తండ్రికి సమాచారం అందించారు. ఆ మృతదేహం తన కుమార్తెదేనని చిన్నారావు గుర్తించాడు. ఈ మేరకు పోలీసులు విచారణ జరిపి నిందితులను అరెస్టు చేశారు.