Tirumala | తిరుమలకు వెళ్లే దారిలో అలిపిరి గేటు వద్ద ఓ యువతి చేసిన ఇన్స్టాగ్రామ్ రీల్ ఇప్పుడు భక్తులకు ఆగ్రహం తెప్పిస్తోంది. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న పుష్ప 2 సినిమాలోని కిస్సిక్ పాటకు ఓ యువతి అదిరిపోయే స్టెప్పులు వేస్తూ వీడియో చేసింది. ఆ వీడియోను ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేసింది. సదరు యువతి ఇన్స్టాలో పోస్టు చేసిన ఆ రీల్ వెంటనే వైరల్గా మారింది. కానీ అది కాస్త భక్తులకు ఆగ్రహాన్ని తెప్పిస్తోంది.
వ్యూస్ కోసం శ్రీవారి సన్నిధిని కూడా వదలడం లేదని భక్తులు మండిపడుతున్నారు. ఇన్స్టాగ్రామ్లో వ్యూస్ కోసం ఇలా తిరుమలలో పిచ్చి పిచ్చి వీడియోలు, ఫ్రాంక్లు చేయడం ఎక్కువైపోయిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం తమిళనాడుకు చెందిన ఓ ఇన్ఫ్లూయెన్సర్ శ్రీవారి క్యూలైన్లలో ఫ్రాంక్ వీడియో చేశాడు. ఆ తర్వాత మాఢ వీధుల్లో వైసీపీ నేత దివ్వెల మాధురి ఫొటోషూట్ చేయడం దుమారానికి దారి తీసింది. ఇక ఇటీవల తిరుమల మెట్ల మార్గంలో వెళ్తుండగా అదిగో చిరుత అంటూ బిగ్బాస్ ఫేమ్, సీరియల్ నటి ప్రియాంక జైన్ చేసిన ప్రాంక్ వీడియో కూడా వివాదాస్పదమైంది. ఇలా ఇటీవల ఇన్ఫ్లూయెన్సర్లు చేస్తున్న వీడియోలను భక్తులు గుర్తుచేసుకున్నారు. ఇలాంటివి పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని టీటీడీని విజ్ఞప్తి చేస్తున్నారు.
రీల్ కోసం తిరుమల కొండ పై పుష్ప 2 ‘కిస్సిక్’ పాటకు డాన్స్
ఓ యువతి తిరుమల కొండ దిగువన పుష్ప-2 మూవీలోని ‘కిస్సిక్’ పాటకు డాన్స్ చేసిన వీడియో తన ఇన్స్టా పేజీలో పోస్ట్ చేసింది.
ఇది కాస్తా వైరల్ కావడంతో పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. వ్యూస్ కోసం శ్రీవారి సన్నిధిని కూడా వదలడం… pic.twitter.com/PLmEypMVys
— Telugu Scribe (@TeluguScribe) December 4, 2024