అమరావతి : సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (Sitaram Yechury) మరణం పేద, కార్మిక వర్గాలకు తీరని లోటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్(Pawankalyan) , మాజీ సీజేఐ ఎన్వీ రమణ(NV Ramana) , మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) అన్నారు. వామపక్ష యోధుడు సీతారాం ఏచూరి ఆత్మకు శాంతి చేకూరాలని , ఆయన ప్రతీ అడుగు పేదలు, పీడితులు, కార్మికుల పక్షాన వేశారని తెలిపారు.
ఎమర్జెన్సీ సమయంలో హక్కుల కోసం బలంగా పోరాడాడని గుర్తు చేశారు. రాజ్యసభ సభ్యుడిగా ఎన్నో ప్రజా సమస్యలను సభ ముందుకు తీసుకొచ్చారని తెలిపారు. ఈ సందర్భంగా ఏచూరి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఏచూరి మరణం తీవ్ర విషాదం నింపిందని లోకేష్ పేర్కొన్నారు. ప్రజాపోరాట యోధుడిని కోల్పోయామని వెల్లడించారు. ఏచూరి అవిశ్రాంత పోరాట యోధుడని, ప్రజల కోసం రాజీలేని పోరాటం చేశారని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ప్రతిపక్షాల ఐక్యతకు కృషి చేసిన జాతీయ నాయకుడు ఏచూరి అని పేర్కొన్నారు.