అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో జరుగబోతున్న సాగునీటి సంఘాల ఎన్నికలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం (YCP’s key decision) తీసుకుంది. ఈ ఎన్నికల్లో పాల్గొనకుండా బహిష్కరిస్తున్నట్లు ఆ పార్టీ కీలక నేత వెల్లడించారు. సాగునీటి సంఘాల ఎన్నికల్లో పార్టీ సానుభూతిపరులను నిలబెట్టి గెలుపొందాలనే ఉద్దేశంతో బరిలోకి దిగిన వైసీపీ క్షేత్రస్థాయిలో వస్తున్న అడ్డంకులను అధిగమించడంలో వస్తున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల బహిష్కరణకు నిర్ణయించింది.
ముఖ్యంగా సాగునీటి సంఘాల్లో సభ్యత్వం ఉన్న రైతులు నో డ్యూస్ (No Dues) దృవీకరణ పత్రం ఉంటేనే పోటీకి గాని, ఓటు (Vote) హక్కు వినియోగానికి గాని అవకాశముంటుంది. అయితే వైసీపీకి చెందిన రైతులు నో డ్యూస్ సర్టిఫికేట్ కోసం వెళితే అక్కడ లోకల్‌గా ఉన్న ప్రత్యర్థులు అభ్యంతరాలు చెప్పడం, సర్టిఫికేట్ ఇవ్వకుండా అడ్డుపడుతుండడంతో ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి.
రాష్ట్రంలో ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగే అవకాశం లేకపోవడంతో బహిష్కరణ నిర్ణయం తీసుకున్నామని వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి( Sajjala Ramakrishna reddy) వెల్లడించారు. ప్రజాస్వామిక స్ఫూర్తికి విరుద్ధంగా సాగునీటి సంఘాల ఎన్నికలు జరుగుతున్నాయని, ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం (Allaince Government ) అరాచకమని వ్యాఖ్యనించారు.
పోలీసులను అడ్డుపెట్టుకుని వైసీపీ నాయకులపై బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పార్టీ అధినేతల నుంచి వచ్చిన అభిప్రాయాల మేరకు వైఎస్ జగన్ ఎన్నికల బహిష్కరణ నిర్ణయం తీసుకున్నారని వివరించారు.