అమరావతి : గత వైసీపీ ఐదేండ్ల పాలనలో(YCP Rule) పరిశ్రమల్లో భద్రత గురించి చర్యలు తీసుకోకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని టీడీపీ (TDP) ఏపీశాఖ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు (Palla Srinivas rao) ఆరోపించారు. విశాఖలో శనివారం ఎంపీ భరత్, ఎమ్మెల్యేతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. అచ్యుతాపురం ఘటనపై మాజీ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను వారు ఖండించారు.
మంత్రులు ఘటనా స్థలానికి వెళ్లలేదని ఆరోపించడం సిగ్గుచేటని అన్నారు. జగన్మోహన్ రెడ్డి శవ రాజకీయాలు మానుకోవాలని సూచించారు. గతంలో సేఫ్టీ ఆడిట్ జరగలేదని అందుకే ప్రమాదానికి కారణమని పేర్కొన్నారు. డిజాస్టర్ మేనేజ్ ఫండ్స్‌ను రూ. 1500 కోట్లను జగన్ ప్రభుత్వం డైవర్ట్ చేసిందని ఆరోపించారు. ఎంపీ భరత్ మాట్లాడుతూ అబద్దాలు వందసార్లు అడితే అది నిజమై పోతుందని జగన్ అనుకుంటున్నారని, గత ఎన్నికల్లో ఆయనను ప్రజలు తిరస్కరించినా ఇంకా బుద్ధి రావడం రాలేదని ఆరోపించారు.