హైదరాబాద్, జూన్ 20(నమస్తే తెలంగాణ): 2029 నాటికి చంద్రబాబు మోసాలు, ప్రలోభాలు గుర్తించి ప్రజలు రెట్టించిన ఉత్సాహంతో మళ్లీ వైపీసీని అధికారంలోకి తెచ్చుకుంటారని మాజీ సీఎం జగన్ తెలిపారు. గురువారం కీలక నేతల సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. నిత్యం ప్రజల్లో ఉండాలని నేతలకు సూచించారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు గడపగడపకూ సంక్షేమ పథకాలు అందించామని గుర్తు చేశారు. 2029లో వైసీపీనే అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు.