Marri Rajasekhar Reddy | వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. ముగ్గురు ఎమ్మెల్సీలు టీడీపీలో చేరారు. ఏపీ సీఎం చంద్రబాబు సమక్షంలో బల్లి కల్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, మర్రి రాజశేఖర్ టీడీపీ కండువా కప్పుకున్నారు. ఇప్పటికే వారు వైసీపీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
టీడీపీలో చేరిన సందర్భంగా మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. మా రాజీనామాలను ఇప్పటివరకు ఆమోదించలేదని తెలిపారు. రాజీనామాల ఆమోదం కోసం ఆరు నెలలుగా వేచి చూశామని పేర్కొన్నారు. రాజీనామా ఆమోదిస్తారన్న నమ్మకం కూడా లేదని చెప్పారు. మండలి చైర్మన్ వెనుక ఉండి నడిపించేవారి వల్ల రాజీనామాలు ఆమోదించలేదని ఆరోపించారు.
సొంత గూటికి రావడం చాలా సంతోషంగా ఉందని కల్యాణ్ చక్రవర్తి తెలిపారు. తమ రాజీనామా ఆమోదించకుండా మండలి చైర్మన్ తమను ఇరకాటంలో పెట్టారని పేర్కొన్నారు. రాజీనామా చేసి ఏడాది అయ్యిందని.. అయినప్పటికీ తమ రాజీనామా ఆమోదించలేదని కర్రి పద్మశ్రీ చెప్పారు.