Pithapuram | ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. పిఠాపురం కేంద్రంగా కొత్త పాలిటిక్స్ తెరలేస్తున్నాయి. గత ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఈసారి పిఠాపురం నుంచి బరిలో దిగాలని చూస్తున్నారు. గెలుపు అంచనాలు అన్నింటినీ బేరీజు వేసుకుని జనసేనాని ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ పిఠాపురంలో గెలుపు అంత ఈజీగా దక్కేలా కనిపించడం లేదు. పవన్‌ను ఓడించే ఏ ఛాన్స్‌ను విడిచిపెట్టని వైసీపీ.. ముద్రగడను బరిలోకి దించాలని యోచిస్తోన్నట్లు తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్‌తో కలిసి నడవాలని కాపు నేత ముద్రగడ పద్మనాభం ముందు నుంచి అనుకున్నారు. కానీ టీడీపీతో పొత్తు పెట్టుకోవడం.. సీట్ల పంపకంలోనూ రాజీ పడటం ముద్రగడకు నచ్చలేదు. పవర్ షేరింగ్ అడగకుండా 24 అసెంబ్లీ స్థానాలకే పరిమితం కావడాన్ని ఇటీవల ఆయన బహిరంగంగా కూడా విమర్శించారు. ఇది కాకుండా మొదట్నుంచి కూడా ముద్రగడకు పవన్ సరైన రెస్పాన్స్ ఇవ్వలేదు. ముద్రగడను ప్రత్యేకంగా కలుస్తానని పలుమార్లు హామీ ఇచ్చిన పవన్ మాట తప్పారు. ఈ తీరు పవన్‌పై ఆగ్రహానికి కారణమయ్యాయి. దీన్ని ముద్రగడ వర్గం ఆయనకు జరిగిన అవమానంగా భావించాయి. ఈ క్రమంలోనే జనసేనలో చేరవద్దని ముద్రగడ ఫిక్సయినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై జనసేన నేత బన్నీ వాసు ముద్రగడ ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. నచ్చజెప్పేందుకు ఎంత ప్రయత్నించినప్పటికీ ముద్రగడ తన నిర్ణయం మార్చుకోలేదని విశ్వసనీయ సమాచారం. జనసేనతో ముద్రగడకు చెడిందని తెలియడంతో వైసీపీ నేతలు రంగంలోకి దిగారు.
కాపు ఉద్యమ నేత అయిన ముద్రగడను తమ పార్టీలో చేర్చుకోవడం ద్వారా పవన్ కళ్యాణ్‌కు చెక్ పెట్టాలని వైసీపీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పిఠాపురం నుంచి పవన్‌పై ముద్రగడను బరిలో దించాలని ప్లాన్ చేస్తోంది. ముద్రగడ అయితేనే పవన్‌పై బలమైన అభ్యర్థి అవుతారని అనుకుంటున్నది. అయితే ఇప్పటికే పిఠాపురం వైసీపీ ఇన్చార్జిగా వంగా గీతను వైఎస్ జగన్ నియమించారు. ఈ క్రమంలో వంగా గీతను సీఎంవోకు పిలిపించుకుని చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఈ భేటీలో గీత కూడా ముద్రగడ పార్టీలోకి వస్తే తప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.