అమరావతి : కడప పార్లమెంట్ సభ్యుడు(MP), వైసీపీ నాయకుడు అవినాష్‌రెడ్డిని(Avinashreddy ) పోలీసులు అరెస్టు (Arrest) చేశారు. సాగు నీటి సంఘాల ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గంలోని పలు మండలాలలో వైసీపీకి చెందిన రైతులకు నో డ్యూస్ ఇవ్వడం లేదని ఆరోపిస్తూ రైతులతో పాటు అవినాష్ రెడ్డి వేముల తహసీల్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ అప్పటికే టీడీపీకి (TDP) చెందిన రైతులు ఉండడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
ముందుజాగ్రత్తగా పోలీసులు అవినాష్ రెడ్డిఅదుపులోకి తీసుకొని వేముల పోలీస్‌స్టేషన్‌కు(Police Station) అక్కడి నుంచి పులివెందులకు తరలించారు. ఈ సందర్భంగా అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ అధికారంలోకి వచ్చి 7 నెలలు కావస్తున్న రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చకపోవడంతో సాగునీటి సంఘాల ఎన్నికల్లో ఘోర పరాభవం తప్పదని భావించి రైతులకు నో డ్యూస్ సర్టిఫికెట్ ఇవ్వడం లేదని మండిపడ్డారు.
రైతులు వచ్చి ప్రజాస్వామ్యబద్దంగా ఓటు వేయడానికి వస్తే పరాభవం ఎదురవుతుందనే భయంతో పోలీసులను అడ్డుపెట్టుకుని దద్దమ్మ రాజకీయాలు ఆడడం సిగ్గుగా లేదాని ప్రశ్నించారు. అధికారులను అడ్డం పెట్టుకొని తప్పుడు రాజకీయాలు చేయడం క్షమించరాని తప్పని పేర్కొన్నారు . ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం లేకపోతే సాగునీటి సంఘాలకు నామినేటెడ్ పదవుల మాదిరి చేసుకుంటే సరిపోయేదని. ఈ మాత్రం దానికి ఎన్నికలని పేరు పెట్టడం దేనికని ప్రశ్నించారు. ప్రభుత్వ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని వెల్లడించారు.