Duvvada Srinivas | వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ రెండో పెళ్లి వ్యవహారం ఇప్పుడు ఏపీలో సంచలనంగా మారింది. కొంతకాలంగా మొదటి భార్యను విడిచిపెట్టి రెండో భార్యతోనే ఉంటున్నాడని మొదటి భార్య కుమార్తెలు రోడ్డెక్కారు. నాన్నను కలవాలని ఉందంటూ దువ్వాడ ఇంటిముందు అర్ధరాత్రి దాకా పడిగాపులు పడ్డారు. అయినప్పటికీ వాళ్లను లోపలికి అనుమతించకపోవడంతో అర్ధరాత్రి సమయంలో అక్కడే ఆందోళనకు దిగారు.
శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని అక్కవరం సమీపంలో జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఆయన ఇంటికి కుమార్తెలు హైందవి, నవీనలు గురువారం వచ్చారు. మధ్యాహ్నం 3 గంటలకు వచ్చినప్పటికీ రాత్రి 8 గంటలు అయినా వాళ్లను లోపలికి అనుమతించలేదు. చీకటి కావడంతో లైట్లు ఆర్పేశారు. దీంతో రాత్రి సమయంలో అక్కడే ఆందోళనకు దిగారు. దివ్వెల మాధురి అనే మహిళతో తమ తండ్రి దువ్వాడ శ్రీనివాస్ ఇల్లీగల్‌గా ఉంటున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఏ హక్కుతో ఆమె తమ ఇంట్లో ఉంటోందని ప్రశ్నించారు. ఆమె మాయలో పడిన నాన్న తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది కాలంగా వాళ్ల డాడీ దూరంగా ఉంటున్నాడని.. ఎన్ని మెసేజ్‌లు చేసినా, కాల్స్ చేసినా స్పందించడం లేదని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.
మా నాన్నని కలవడానికి వెళితే డోర్స్ అన్ని లాక్ చేసుకున్నాడు.
ఆ లేడీ వల్లే గత ఏడాది కాలంగా మా డాడీ మాకు దూరంగా ఉంటున్నాడు.
ఎన్ని మెసేజెస్, కాల్స్ చేసినా అయన స్పందించడం లేదు.
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుమార్తె. #Andhrapradesh #DhuvvadaSrinivas #YSRCP #MLC… pic.twitter.com/toxuIxlF0g
— BIG TV Breaking News (@bigtvtelugu) August 9, 2024
సార్వత్రిక ఎన్నికల సమయంలోనే దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీలో వివాదాలు బయటపడ్డాయి. టెక్కలి వైసీపీ ఇన్ఛార్జిగా దువ్వాడ శ్రీనివాస్‌ను తొలగించి.. దువ్వాడ వాణిని జగన్ నియమించారు. ఇది స్థానికంగా సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ఏమైందో కానీ.. ఆ వెంటనే మళ్లీ టికెట్‌ను శ్రీనివాస్‌కు కేటాయించారు. భార్యాభర్తల మధ్య సఖ్యత లేదని ఆ టైమ్‌లోనే బయటపడింది. ఈ క్రమంలోనే వేరే మహిళ వీళ్ల సంసారం మధ్యలోకి వచ్చినట్లు తెలుస్తోంది.